Skip to main content

దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. మహేష్ ను అలా లాక్ చేసేసాడు!

దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. మహేష్ ను అలా లాక్ చేసేసాడు!
దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. మహేష్ ను అలా లాక్ చేసేసాడు!

నిర్మాతగా దిల్ రాజు స్థాయి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కొక్క సినిమాతో నిర్మాతగా విజయవంతంగా తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్లిన దిల్ రాజు, చాలా తక్కువ కాలంలోనే అగ్రనిర్మాతగా అవతరించాడు. స్వతహాగా డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు, అక్కడ కూడా లాభాలు గడించి, తెలుగు రాష్ట్రాల్లో అటు డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా కొనసాగుతున్నాడు. ఈరోజు దిల్ రాజు సపోర్ట్ లేకుండా చాలా సినిమాలు నైజాంలో కానీ, వైజాగ్ లో కానీ విడుదల చేసుకోలేని పరిస్థితి. ఈ రెండు ప్రాంతాల్లో చాలా థియేటర్లు తన గుప్పిట్లోనే ఉండడం దీనికి ప్రధాన కారణం. ఇక ఇవన్నీ పక్కనపెట్టేస్తే దిల్ రాజు తెలివి గురించి ఫిలిం నగర్ లో కథలుకథలుగా చెప్పుకుంటారు. లేటెస్ట్ గా అలాంటి ఉదాహరణ ఒకటి బయటపడింది.

నిజానికి మహర్షి సినిమా దిల్ రాజు ఒక్కడే నిర్మించాల్సి ఉంది. వంశీ పైడిపల్లితో ఆ రకమైన అగ్రిమెంట్ దిల్ రాజుకి ఉంది. మహేష్ కూడా అప్పటికే దిల్ రాజుకు సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. ఈ నేపథ్యంలో దిల్ రాజు నిర్మాణంలో మహేష్ సినిమా విడుదలవుతుంది అనగా పివిపి వచ్చి బ్రహ్మోత్సవం తాలూకు కథను వినిపించాడు. అశ్విని దత్ కూడా బాబుతో ఉన్న అనుబంధాన్ని, తనకిచ్చిన మాటను ప్రస్తావించాడు. అలా మహర్షి ముగ్గురు నిర్మాతలతో కలిసి తెరకెక్కింది. దీంతో మహర్షి వల్ల ఒక్కొక్కొళ్ళకి మిగిలింది తక్కువే అని చెప్పాలి. ఈ విషయంలో దిల్ రాజు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాడని అప్పుడు వార్తలు కూడా వచ్చాయి.

ఇక సరిలేరు నీకెవ్వరు చిత్రానికి అనిల్ సుంకర నిర్మాత అయినా కూడా మహేష్ దిల్ రాజును కూడా ఈ చిత్రాన్ని నిర్మించమని రిక్వెస్ట్ చేసాడు. అయితే ఇక్కడే దిల్ రాజు తెలివిగా వ్యవహరించాడు. మరోసారి మరో నిర్మాతతో కలిసి సినిమా నిర్మిస్తే కష్టమని భావించి ఈ సినిమాకు సైలెంట్ పార్ట్నర్ గా ఉండిపోయాడు. నిర్మాణ బాధ్యతలు తీసుకోలేదు. కేవలం సినిమా రిలీజ్ అప్పుడు తన సహాయ సహకారాలు అందిస్తాడు. నైజాంలో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఇలా చేయడం వల్ల దిల్ రాజుకు రెండు లాభాలు ఉన్నాయి. మహేష్ తో తనకున్న అగ్రిమెంట్ కారణంగా మరో సినిమాను తనతో నిర్మించవచ్చు. అలాగే అనిల్ రావిపూడితో కూడా ఎఫ్ 2 తర్వాత మరో సినిమాకు డీల్ చేసుకున్నాడు. ఒకవేళ సరిలేరు నీకెవ్వరు నిర్మాణంలో భాగం తీసుకుని ఉంటే అటు మహేష్ తో, ఇటు అనిల్ రావిపూడితో ఒకేసారి డీల్ క్లోజ్ అయిపోయేది. అందుకే నిర్మాణంలో భాగం తీసుకోకుండా ఆ డీల్ ను అలాగే ఉంచాడు. అటు మహేష్ తో దిల్ రాజు ఒక సినిమాను నిర్మించవచ్చు. అలాగే ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 కూడా అనిల్ రావిపూడి దిల్ రాజుకే చేసి పెట్టాలి. అది కూడా ఎఫ్ 2 అప్పటి రెమ్యునరేషన్ తో. సరిలేరు నీకెవ్వరు తర్వాత తన రెమ్యునరేషన్ ను బాగా పెంచుదామనుకున్న అనిల్ రావిపూడికి ఇది ఒక రకంగా దెబ్బే అని చెప్పాలి. దిల్ రాజా మజాకానా!



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/34S28Ac

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...