రైతుల నేపధ్యంలో అనేక కథలు సినిమాలుగా వచ్చాయి. అన్నీ రైతుల పేరు చెప్పుకుని డబ్బులు చేసుకుని వెళ్ళిపోవడం తప్ప, రైతులకు ఏమీ చేసింది లేదు. కానీ తమిళ చిత్ర సీమ లో అలా కాదు. “కాక్క ముట్టాయి” లాంటి అద్భుతమైన సినిమాతో దర్శకునిగా మారిన సినిమాటోగ్రాఫర్ మనికందన్ ఇప్పుడు తాజాగా కడఇసై వ్యవసాయి (ఆఖరి రైతు) అనే సినిమాను తీసారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆ సినిమా ట్రైలర్ ని చూసి యావత్ భారతదేశ నుండి ఆయనకు ప్రసంశలు వస్తున్నాయి. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ “విజయ్ సేతుపతి” ఒక మానసిక వికలాంగుడి పాత్రలో నటించారు. ఇక హీరోగా నందిల్ అనే ఒక 85 ఏళ్ళ వ్యక్తి బహుశా అతను నిజంగా రైతు కావచ్చు నటించారు.
ఇక సినిమా ట్రైలర్ లో మొదట ఒక వూర్లో జనాభా అంతా అక్కడ ఉండే మర్రిచెట్టు పై పెద్ద పిడుగు పడి తగలబడిపోవడం వల్ల, గ్రామదేవతలకు శాంతి చెయ్యాలని అనుకుంటూ ఉంటారు. ఇక హీరో పాత్ర వేస్తున్న రైతు పోలిస్ ని పొరపాటుగా కరెంట్ పని చేసే అతనిగా భావిస్తాడు. ఇక్కడే మన విజయ్ సేతుపతి ఒక విచిత్రమైన గెటప్ లో కనపడతాడు.
“బిల్ గేట్స్ నాకు తెలుసు కానీ మాట్లాడను”.. అనీ;
కోతికి అరటిపండ్లు పెడుతూ “జంట కాయ ఇస్తున్నా, నీకు కవల పిల్లలు పుడతారు” అనీ
“తిరుచెందూరు వెళ్ళా నప్పా; కానీ అక్కడ మురుగన్ లేడు; కోపంతో వెళ్ళిపోయాడు”, అంటూ విజయ్ సేతుపతి మాట్లాడుతుంటే మనసులో ఎదో ఒక ఆర్ద్రత నిండుతుంది.
ఇక హత్య చేసాడని అనుమానించి కోర్ట్ కి తీసుకువస్తే, ఆ రైతు “కొంచెం టైం ఇవ్వండి, పొలానికి నీళ్ళు పెట్టి వస్తానంటాడు. విత్తనాల కొట్టు వాడు “ఇవి తెల్లోల్లు పండించినవి. సీడ్స్ ఉండవు” అంటే; “బహుశా.. ఇవి తయారుచేసినోడి తండ్రికి కూడా కింద అవి లేవేమో” అంటూ ఆ పేద రైతు అనడం, ఇలా ట్రైలర్ చూస్తుంటే నిజమైన సినిమా లవర్స్ ఎందుకు సినిమా అంటే అంత ఎగ్జైట్ అవుతాడో తెలుస్తుంది.
ఇక తీసిన నాలుగు సినిమాలతో యావత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ తో ప్రశంశలు పొందిన మనికందన్ ఈ సినిమాతో మళ్ళీ తమిళ సినిమాను ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్ధాడు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2S0Gfeh
Comments
Post a Comment