సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంతో కాలంగా తన మనసులో ఉన్నమాటను బయట పెట్టారు. తాజాగా జరిగిన దర్బార్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా జరిగిన విలేఖరుల కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన విషయాని బయటపెట్టారు. సుమారు 40 ఏళ్ళకు పైబడిన సినిమా జీవితం, ఎన్నో విభిన్నమైన కథలు, క్యారెక్టర్ లు చేసాడు తలైవర్. దర్బార్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక రిపోర్టర్ రజనీ ని మీరు ఇంకా ఏ క్యారెక్టర్ చెయ్యాలి అని అనుకుంటున్నారు.? అని అడుగగా రజనీకాంత్ వెంటనే ఏ మాత్రం తడబడకుండా, “ట్రాన్స్ జెండర్” అని చెప్పారు. అక్కడ ఒక్క క్షణం వెంటనే అందరూ షాక్ అయ్యి, వెంటనే చప్పట్లు కొట్టారు.
గతంలో కూడా పెద్ద పెద్ద నటులు కూడా హిజ్రా క్యారెక్టర్ లు చెయ్యాలని ఆశ పడి, ఆ కోరిక నెరవేర్చుకున్నారు. నటరత్న ఎన్టీఆర్ బృహన్నల పాత్ర వేసారు. ఫీసెంట్ గా అయితే తమిళ్ కొరియోగ్రాఫర్ & దర్శకుడు మరియు రజనీకాంత్ ని ఒక గురువులా భావించే రాఘవ లారెన్స్ తాను హీరోగా చేస్తున్న ముని & కాంచన సీరీస్ సినిమాలలో కాంచన 2 సినిమాలో హిజ్రాగా నటించాడు. ఆ తర్వాత కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా ఆ సినిమాను కల్పన గా రీమేక్ చేసాడు. ఇప్పుడు ఆ సినిమాను హిందీలో అక్షయ్ కుమార్ ఆ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఒక హిజ్రా పాత్రను హీరో పోషించడం అందులోనూ, ఒక రజనీకాంత్ లాంటి పెద్ద స్టార్ అలంటి పాత్ర వేస్తే అది ఖచ్చితంగా అది ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/38QWHUH
Comments
Post a Comment