Skip to main content

స‌రిలేరు నీకెవ్వ‌రు – ఎవ‌రి వాటా ఎంత‌?

Sarileru Neekevvaru movie business share
స‌రిలేరు నీకెవ్వ‌రు ఎవ‌రి వాటా ఎంత‌?

మహేష్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. `ఎఫ్‌2` వంటి హిలేరియ‌స్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత అనిల్ రావిపూడి నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. దిల్ రాజుతో క‌లిసి ఈ చిత్రాన్ని ఏకె ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ మ‌హేష్ ఆర్మీ మేజ‌ర్ అజ‌య్ కృష్ణ‌గా ఇందులో క‌నిపించ‌బోతున్నారు. దాదాపు 14 ఏళ్ల విరామం త‌రువాత లేడీ సూప‌ర్‌స్టార్ విజ‌య‌శాంతి ఈ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు.

ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ టీజ‌ర్‌కి ప్రేక్ష‌కుల నుంచి, ట్రేడ్ వ‌ర్గాల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. దేశ ర‌క్ష‌ణ కోసం ప్రాణాల‌ని సైతం ప‌ణంగా పెట్టి వీర మ‌ర‌ణం పొందిన సైనికుల‌కు అంకితం చేస్తూ ఇటీవ‌ల విడుద‌ల చేసిన టైటిల్ సాంగ్, టీజ‌ర్‌లో `మ‌న ద‌గ్గ‌ర బేరాలేవీ లేవ‌మ్మా` అంటూ మ‌హేష్ చెప్పిన డైలాగ్‌ల‌తో సినిమాపై మ‌రింత క్రేజ్‌ని తీసుకొచ్చింది. ఈ చిత్రానికి టెక్నీషియ‌న్స్, పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ క‌లిపి 100 కోట్లు దాటిన‌ట్లు తెలుస్తోంది. న‌టీనటుల, సాంకేతిక నిపుణుల‌ పారితోషికాల‌కే 65 దాటింద‌ట‌. ఇక పోస్ట్ ప్రొడక్షన్ రూపంలో మ‌రో 35 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ట‌. ఇందులో కేవ‌లం కాశ్మీర్ ఎపిసోడ్‌లో చిత్రీక‌రించిన కీల‌క స‌న్నివేశాల‌కే భారీ స్థాయిలో చిత్ర బృందం ఖ‌ర్చు చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఇందులో హీరో మ‌హేష్‌బాబు పారితోషికం లెక్క క‌ట్ట‌లేదు. ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి రావ‌డానికి ముందు ఓ ఒప్పందాన్ని హీరో, నిర్మాత‌లు చేసుకున్నార‌ట‌. హీరో పారితోషికం కాకుండా వ‌చ్చిన లాభాల్లో వాటా రూపంలో తీసుకోవాల‌న్న‌ది ఒప్పందం. అందుకు గాను హీరో మ‌హేష్‌కు ఈ సినిమా ద్వారా దాదాపు 50 కోట్లు అంద‌బోతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. సినిమా బ‌డ్జెట్ ఇప్ప‌టికే 100 కోట్లు దాటింది. దీన్ని మించి బిజినెస్ చేయ‌గ‌లిగితేనే నిర్మాత‌లకు లాభాలు వ‌స్తాయి. 50 కోట్ల మొత్తం హీరోకు అందించిన త‌రువాత మిగిలిన మొత్తాన్ని మాత్ర‌మే నిర్మాత‌లు దిల్‌రాజు, అనిల్ సుంక‌ర పంచుకోవాల‌ని ఒప్పందం చేసుకున్నార‌ట‌. మ‌రి అనుకున్న స్థాయిలో అంద‌రికి వాటాలు తేలాలంటే సినిమా 100 కోట్ల‌కు మించి బిజినెస్ చేయాలి. ఆ స్టామినా `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రానికి వుందా? అన్న‌ది తెలియాలంటే సినిమా రిలీజ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PwapDi

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...