సోషల్ మీడియా వాడకం పెరిగిన దగ్గరి నుంచి ప్రతి సందర్భాన్ని సోషల్ మీడియా వేదికపై పంచుకోవడం అలవాటుగా మారింది. సినీ తారలైతే షూటింగట్ అప్‌డేట్స్‌తో పాటు ప్రతి విషయాన్ని ఆడియన్స్‌తో పంచుకుంటున్నారు. కొంత మందికిది క్రేజీ అలవాటుగా మారింది. స్టార్ హీరోల నుంచి అప్ కమింగ్ హీరోల వరకు ఏ మూల ఏ చిన్న అప్‌డేట్ తగిలినా, షూటింగ్ లొకేషన్‌లో ఎలాంటి సంఘటన జరిగినా దాన్ని వెంటనే సోషల్ మీడియాలో ఫొటోలతో సహా పోస్ట్‌చేస్తున్నారు.
అవి సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. అలాంటి ఓ చిలిపి సందర్భాన్నే యంగ్ హీరో నితిన్ ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నారు. నితిన్ ప్రస్తుతం `భీష్మ` చిత్రంలో నటిస్తున్నారు. `ఛలో` ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్ పూర్తయింది. నెక్ట్స్ షెడ్యూల్ కోసం చిత్ర బృందం రోమ్ వెళ్లింది. అక్కడ హీరో నితిన్, హీరోయిన్ రష్మిక మందన్నలపై శేఖర్ మాస్టర్ నేతృత్వంలో ఓ పాటని చిత్రీకరించబోతున్నారు.
అక్కడ వాతావరణం వింటర్ కావడంతో చాలా చల్లగా వుందట. అయితే హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుములకు ఐస్‌క్రీమ్ తినాలనిపించిందట. అయితే వాతావరణం కోల్డ్‌గా వుందని ఇద్దరం ఐస్‌క్రీమ్ తినాలనుకున్నామని అయితే అది కాస్తా కోల్డ్ క్రీమ్‌గా మారిపోయిందని సరదగా నితిన్ పెట్టిన పోస్ట్ ఇన్‌స్టాలో ఆకట్టుకుంటోంది. నితిన్ పెళ్లి వద్దని బ్రహ్మచర్యమే ముద్దని వాదించే పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/36Sz3VS
Comments
Post a Comment