Skip to main content

ర‌జ‌నీకాంత్‌ స్టైల్‌..గ్రేస్ ఏం మార‌లేదు!

ర‌జ‌నీకాంత్‌ స్టైల్‌..గ్రేస్ ఏం మార‌లేదు!
ర‌జ‌నీకాంత్‌ స్టైల్‌..గ్రేస్ ఏం మార‌లేదు!

రజ‌నీ అంటే ఓ స్టైల్‌… మేన‌రిజ‌మ్స్‌కి ఓ మాస్ట‌ర్‌. ఆయ‌న తెర‌పై క‌నిపిస్తే మెరుపులే.. ఆయ‌న‌ న‌డ‌కే ఓ స్టైల్… భార‌తీయ సినిమాల్లో హీరో పాత్ర‌ల‌కు స్టైల్ ని ఆపాదించ‌డంలో త‌లైవ‌ర్ ర‌జ‌నీకాంత్ ది ప్ర‌త్యేక శైలి. ఆ శైలిని స్ఫూర్తిగా తీసుకుని ఇప్ప‌టికి భారతీయ సినిమాల్లోకి ఎంతో మంది రంగ ప్ర‌వేశం చేశారే కానీ ర‌జ‌నీని మాత్రం మ‌రిపించ‌డం కాదుక‌దా స్టైల్ ప‌రంగా, మేన‌రిజ‌మ్స్ ప‌రంగా ఆయ‌న ద‌రిదాపుల్లోకి కూడా రాలేక‌పోయారంటే ర‌జ‌నీ స్టైల్ కున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవ‌చ్చు. స‌రిగ్గా 44 ఏళ్ల క్రితం ర‌జ‌నీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. త‌న స్టైల్స్‌తో, మేప‌రిజ‌మ్స్‌తో ఆక‌ట్టుకుని సూప‌ర్‌స్టార్‌గా ఎదిగారు.

బ‌స్‌లో వెళుతుండ‌గా ర‌జ‌నీ స్టైల్‌ని గ‌మ‌నించి ద్శ‌కుడు బాల చంద‌ర్ ఆయ‌న‌ని నటుడిని చేస్తాన‌ని మాటిచ్చారు. ఆ మాట ప్ర‌కారం శివాజీరావు గైక్వాడ్‌గా వున్న ఆయ‌న‌ని తమిళ తెర‌కు `అపూర్వ రాగంగ‌ల్‌` సినిమాతో ర‌జ‌నీకాంత్‌గా ప‌రిచ‌యం చేశారు. ఇందులో ఆయ‌న న‌ట‌న చూసిన వారంతా ఇత‌డెవ‌రో కొత్త‌గా వున్నాడే అని ఆరా తీయ‌డం మొద‌లుపెట్టారు. అక్క‌డి నుంచి ర‌జ‌నీ న‌ట ప్ర‌స్థానం మొద‌లైంది. ఆ త‌రువాత తెలుగు, త‌మిళ భాష‌ల్లో బాల‌చంద‌ర్ తెర‌కెక్కించిన `అంతులేని క‌థ` ర‌జ‌నీకి రెండు భాష‌ల్లోనూ మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. 1978లో వ‌చ్చిన `భైర‌వి` ర‌జ‌నీకాంత్‌ని సూప‌ర్‌స్టార్‌ని చేసింది. ఆ సినిమాలో ర‌జ‌నీ స్టైల్‌, మేన‌రిజ‌మ్స్ ఆనాటి యువ‌త‌ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఈ సినిమా త‌రువాత నుంచే ర‌జ‌నీ త‌మిళ ప్రేక్ష‌కుల‌కు డెమీ గాడ్‌గా మారారు.

1980లో వ‌చ్చిన `బిల్లా` సినిమాతో మాస్‌కి మ‌రింత చేరువైన ర‌జ‌నీని బాషా, ముత్తు, అరుణాచ‌లం చిత్రాలు హీరోగా ఆయ‌న కెరీర్‌నే మ‌లుపు తిప్పాయి. స్టార్ హీరోగా తిరుగులేని కీర్తిని సొంతం చేసుకునేలా చేశాయి. ఎంత ఎదిగినా ఒదిగి వుండే ల‌క్ష‌ణ‌మే ఆయ‌న‌ని ఈ స్థాయికి చేర్చింద‌ని ర‌జ‌నీ స‌న్నిహితులు చెబుతుంటారు. `బాబా` సినిమాకు ముందు నుంచే ఆధ్యాత్మిక యాత్ర చేస్తూ ప్ర‌తి సంవ‌త్సం హిమాల‌యాల‌కు వెళ్లివ‌స్తున్నారాయ‌న‌. ఇప్ప‌టికే ఆ సంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తూనే వున్నారు. 167 చిత్రాల్లో న‌టించిన ర‌జ‌నీలో ఇప్ప‌టికీ అదే మెరుపు వేగం. అదే స్పార్క్ తొణికిస‌లాడుతోంది. స్టార్ హీరోగా ఎత్తుప‌ల్లాలు చూసిన ర‌జ‌నీ ఎంత స్టార్ హీరో అయినా ఇప్ప‌టికీ నిరాడంబరంగానే వుంటూ ప‌లువురికి ఆద‌ర్శంగా నిలుస్తున్న ర‌జ‌నీ పుట్టిన రోజు నేడు. 69వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న ఆయ‌న ఇదే జోష్‌తో..అదేస్టైల్‌ని మెయింటైన్ చేస్తూ మ‌రిన్ని పుట్టిన రోజులు జ‌రుపుకోవాల‌ని, ఇలాగే త‌న అభిమానుల్ని ఎంట‌ర్‌టైన్ చేయాల‌ని ఆశిద్దాం.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2LN9fCr

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...