మిల్కీవైట్‌బ్యూటీ తమన్నా ఇండస్డ్రీలోకి ప్రవేశించి దాదాపు 15 ఏళ్లవుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తనదైన నటనతో ఆకట్టుకుంది. నటిగా ఇన్నేళ్ల ప్రయాణంలో క్రేజీ స్టార్ల సరసన నటించి మంచి పేరే తెచ్చుకుంది. వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో ఒక దశలో యమ బిజీగా మారిన తమన్నాకు ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేవు. అయినా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కథనాయికగా అవకాశాలు లేకపోయినా ప్రత్యేక గీతాల్లో మాత్రం రచ్చ చేస్తోంది. నేడు ఆమె పుట్టిన రోజు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తమన్నా ఫ్యాన్స్ బర్త్‌డే విషెస్ చెబుతూ హంగామా చేస్తున్నారు.
తమన్నాప్రత్యేక గీతంలో నటించిన చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. మహేష్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా కోసం ఇప్పటికే కొన్ని పాటల్ని రిలీజ్ చేశారు. త్వరలో తమన్నా సాంగ్‌ని రిలీజ్ చేస్తారట. సినిమాలో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ ప్రత్యే ఆకర్షణగా నిలుస్తుందని, ఆమె వేసిన గ్రేస్‌ఫుల్ స్టెప్స్ ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. శనివారం తమన్నా పుట్టిన రోజు కావడంతో చిత్ర బృందం ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేసి బర్త్‌డే విషెస్ తెలియజేశారు.
ఈ ఫస్ట్ లుక్‌లో తమన్నా మిలటరీ గ్రీన్ పాంట్.. బ్రౌన్ బ్లాక్ కలర్ లో వున్న టాప్‌ని ధరించి గ్రేస్ ఫుల్ స్మైల్‌తో కనిపిస్తోంది. సినిమాలో పాట ఏ రేంజ్‌లో వుండబోతోందో ఈ స్టిల్‌ని బట్టే అర్థమవుతోంది. సినిమాలో మిలటరీ ఆఫీసర్స్ ఓ ఆపరేషన్‌ని విజయవంతం చేసిన తరువాత జరుపుకునే సంబరాల నేపథ్యంలో తమన్నా పాట వుంటుందని తెలుస్తోంది. అయితే ఈ పాటని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారన్న విషయంలో మాత్రం మేకర్స్ స్పష్టతనివ్వాల్సి వుంది. దేవ భక్తి నేపథ్యంలో రూపొందుతున్న `సరిలేరు నీకెవ్వరు` జనవరి 11న విడుదల కానుంది.
Here’s wishing the gorgeous and super talented @tamannaahspeaks a very happy birthday from team #SarileruNeekevvaru
Superstar @urstrulyMahesh @AnilRavipudi @vijayashanthi_m @iamRashmika @ThisIsDSP @RathnaveluDop @AKentsOfficial @GMBents @SVC_official pic.twitter.com/PQ3xZueVJs
— Sri Venkateswara Creations (@SVC_official) December 21, 2019
Credit: Twitter
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/34Je3PN

Comments
Post a Comment