Skip to main content

‘మైండ్ బ్లాక్’ రేటు తెలిస్తే మైండ్ బ్లాకవ్వాల్సిందే

'మైండ్ బ్లాక్' రేటు తెలిస్తే మైండ్ బ్లాకవ్వాల్సిందే
‘మైండ్ బ్లాక్’ రేటు తెలిస్తే మైండ్ బ్లాకవ్వాల్సిందే

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదల కానున్న విషయం తెల్సిందే. భరత్ అనే నేను, మహర్షి హిట్స్ తర్వాత మహేష్, వరసగా నాలుగు హిట్లు ఇచ్చిన జోష్ లో ఉన్న అనిల్ రావిపూడి కలిసి చేసిన చిత్రం కావడంతో సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై ఇంప్రెషన్ ను మరింతగా పెంచడంలో సక్సెస్ అయ్యాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. నిన్నటితో షూటింగ్ పూర్తయినట్లు చిత్ర వర్గాలు అఫీషియల్ గా ధృవీకరించాయి. ఇక ఈ చిత్రం గురించిన ఒక తాజా అప్డేట్ అందరి నోరెళ్ళబెట్టేలా చేస్తోంది.

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మైండ్ బ్లాక్ అనే మాస్ బీట్ సాంగ్ ఉన్న విషయం తెల్సిందే. ఈ పాటలో మహేష్, తమన్నా కలిసి డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పాటలోనే మహేష్ లుంగీ కట్టి మరీ డ్యాన్స్ చేసాడని అంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా లీకయ్యాయి. ఇక ఈ పాట కోసం భారీ సెట్స్ వేసినట్లు తెలుస్తోంది. దాదాపు 5 కోట్లు విలువ చేసే సెట్ వేసి మరీ ఈ మాస్ సాంగ్ ను చిత్రీకరించారట. ఎక్కువ సంఖ్యలో డ్యాన్సర్లు, ప్రాపర్టీస్ కూడా ఉన్న కారణంగా మొత్తం పాట షూట్ చేయడానికి దాదాపు 9 కోట్లు దాకా నిర్మాతకు వదిలిందిట. అయితే మహేష్ కెరీర్ లోనే ఈ సాంగ్ ప్రత్యేకంగా నిలిచిపోతుందని అంటున్నారు. అన్నపూర్ణ 7 ఎకరాలలో ఈ పాట షూటింగ్ జరిగింది.

ఈ పాట అనే కాదు. ఈ సినిమాలో వివిధ సెట్లకు చాలా ఖర్చు అయినట్లు తెలుస్తోంది. కర్నూల్ కొండారెడ్డి బురుజు సెంటర్ ను సెట్ వేసి అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే విజయశాంతి పాత్ర తాలూకా ఇంటి సెట్ కోసం దాదాపు 2 కోట్లపైనే ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఇప్పుడేమో ఈ సాంగ్. ఇలా సరిలేరు నీకెవ్వరు బడ్జెట్ దాదాపు 100 కోట్లు దాటిందని చెబుతున్నారు.

మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Z35I8t

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...