కాసిన చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి. మౌనం గా మొలకెత్తే భూమికే నాగలి పోట్లు గుచ్చుకుంటాయి. ఎంత దూరం పయనించినా చివరికి మేఘాలు మనకోసమే వర్షిస్తాయి. దేవుడు కూడా అంతే, తట్టుకొనే శక్తి ఉన్న వాళ్ళకే ఎక్కువగా పరీక్షలు పెడతాడు. మానవత్వం ఉన్న ప్రతీ మనసు కరిగి, కన్నీరుమున్నిరైన సంఘటన అక్కడ చోటు చేసుకుంది. అమాయకమైన ఆ చిన్నారి ప్రవర్తించిన తీరుకి విధి సైతం ఒక్కసారి వణికి వలా వలా ఏడ్చి ఉంటుంది.
వివరాలలోకి వెళ్తే చత్తీస్ గడ్ రాష్ట్ర పోలీసు అధికారి S.I మూల్ చంద్ విధి నిర్వహణ నిమిత్తం నిండు చూలాలిగా ఉన్న తన భర్యను వదిలి దండాకరణ్యం లో డ్యూటీకి వెళ్ళాడు. ఆ సమయంలో జరిగిన కాల్పులలో నక్సల్స్ దాడిలో వీరమరణం పొందాడు. ఆ తరువాత అతని భార్య ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. లోకం ఎరుగని ఆ చిట్టి తల్లి తండ్రిని ప్రత్యక్షంగా చూడకపోయినా, తన తల్లి మాటలలోమరియు ఆమె చూపించిన జ్ఞాపకాలలో తన తండ్రిని చూసి గుర్తుపెట్టుకుంది.
ఇక ఏడాది తరువాత జరిగిన ఆ పోలిస్ అధికారి సంస్మరణ సభకు అతని భార్య తన బిడ్డతో హాజరయ్యారు. అక్కడ అందరిలో కూడా ఆ చిట్టి తల్లి తన తండ్రి విగ్రహాన్ని గుర్తుపట్టి అక్కడకి వెళ్ళింది. ఆ బొమ్మే తన తండ్రి అనుకుని తన ముద్దు ముద్దు మాటలతో చేష్టలతో ఆనందించింది. తన చేత్తో ఆ బొమ్మకు స్వీట్ తినిపిస్తూ ఆ చిట్టి తల్లి చూపిన ప్రేమ చూసి హృదయం బద్దలయ్యేలా దుఖించారు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ..
ఇలాంటి సంఘటనలు చూసినప్పుడే అనిపిస్తుంది; ప్రపంచంలో అన్నిటికన్నా ప్రేమే గొప్పది అని;
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35yGcdM
Comments
Post a Comment