సప్తగిరి ఒక చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి వచ్చి, అనుకోకుండా నటుడై, బొమ్మరిల్లు భాస్కర్ ప్రోత్సాహంతో కమెడియన్ గా అడుగులు వేసాడు. పరుగు, కందిరీగ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ & ప్రేమ కథా చిత్రం సినిమాలతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. కమెడియన్ గా హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటూ మళ్ళీ సడెన్ గా హీరో అవతారం ఎత్తాడు. సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమా సేఫ్ ప్రాజెక్ట్ అయినా సప్తగిరి L.L.B ఆ తర్వాత ఇంకొన్ని సినిమాలు ఆడలేదు. దీనితో మళ్ళీ సందీప్ కిషన్ సినిమాలో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు బాలక్రిష్ణ రూలర్ సినిమాలో బాలయ్య సరసన నటించాడు.
అయితే రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సప్తగిరి తనకు నటనలో ఎన్టీఆర్ ఆదర్శమని, ఆయన అంటే తనకు దైవంతో సమానమని దానవీర శూర కర్ణ డైలాగ్ చెప్పి అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే దీనిపై కొంత మంది ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గతంలో సప్తగిరి నటించిన ఒక సినిమాకు పవన్ కళ్యాణ్ గెస్ట్ గా హాజరయితే, ఆ ఫంక్షన్ లో పవన్ ని , చిరు ని ఆకాసానికేత్తేసాడు సప్తగిరి. మరి ఇప్పుడు కొత్తగా నందమూరి భజన ఏమిటని.? సప్తగిరి గోడ మీద పిల్లి లా పార్టీ మార్చేసాడని కొంతమంది మెగా ఫ్యాన్స్ సప్త్గిరిని తెగ ట్రోల్ చేస్తున్నారు.
గతంలో సప్తగిరి సినిమాలను దగ్గరుండి ప్రమోట్ చేసిన పవన్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో పైకి చెప్పట్లేదు కానీ, కొంత అసహనంతో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ లో కూడా పాలిటిక్స్ మాదిరి, కాంపౌండ్ లు తయారై, భజన చేసే వారికే అవకాశాలు ఇస్తున్నారన్న వార్తలకి ఈ సంఘటనతో బలం చేకూరింది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/36LQffz
Comments
Post a Comment