Skip to main content

చైనాలో రామ్‌గోపాల్‌వ‌ర్మ‌ హంగామా!

చైనాలో రామ్‌గోపాల్‌వ‌ర్మ‌ హంగామా!
చైనాలో రామ్‌గోపాల్‌వ‌ర్మ‌ హంగామా!

తెలుగు రాష్ట్రాల్లో 12న వివాదాస్ప‌ద చిత్రం `అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు` చిత్రాన్ని రిలీజ్ చేసిన రామ్‌గోపాల్‌వ‌ర్మ 13న మాత్రం చైనాలో హంగామా చేస్తున్నాడు. ఆయ‌న రూపొందించిన తాజా చిత్రం `ఎంట‌ర్ ద గాళ్ డ్రాగ‌న్‌`. మార్ష‌ల్ ఆర్ట్స్ ప్ర‌ధానంగా వ‌ర్మ ఈ చిత్రాన్ని రూపొందిచారు. బ్రూస్‌లీ అంటే వ‌ర్మ‌కు చాలా ఇష్టం. ఆ ఇష్టంతో కాలేజీ రోజుల్లో మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. అయితే అదే మార్ష‌ల్ ఆర్ట్స్‌పై సినిమా చేయాల‌ని గ‌త కొంత కాలంగా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా `ఎంట‌ర్ ద గాళ్ డ్రాగ‌న్‌` పేరుతో ఓ చిత్రాన్ని తెర‌పైకి తీసుకొచ్చారు. ఓ యంగ్ లేడీ మార్ష‌ల్ ఆర్ట్స్ ఫైట‌ర్‌గా న‌టించిన ఈ సిరిమా టీజ‌క్ గ్లింప్స్‌ని వ‌ర్మ శుక్ర‌వారం చైనాలో రిలీజ్ చేస్తుండ‌టం ప‌లువురిని షాక్‌కు గురిచేస్తోంది.

పూజా భాలేక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ చిత్ర టీజ‌ర్ గ్లింప్స్ లాంచ్ కోసం శుక్రవారం చైనాలోని ఫోష‌న్ సిటీలో భారీ స్థాయిలో సినిమా క‌టౌట్‌ల‌తో ఏర్పాట్లు చేశారు. వ‌ర్మ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని చిత్ర ట్రైల‌ర్‌ను మ‌ధ్యాహ్నం 3:12 నిమిషాల‌కు రిలీజ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోల‌ని ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్‌వ‌ర్మ ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. `ఫోష‌న్ సిటీలో ఇంట‌ర్నేష‌న్ మూవీ `ఎంట‌ర్ ద గాళ్ డ్రాగ‌న్‌` ట్రైల‌ర్ రిలీజ్‌ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ట్రైల‌ర్‌ను మ‌ధ్యాహ్నం 3:12 నిమిషాల‌కు రిలీజ్ చేస్తున్నాం. బ్రూస్‌లీ అతి పెద్ద విగ్ర‌హం వున్న సిటీ చైనాలో ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది` అని ట్వీట్ చేశారు.

`బ్రూస్‌లీ న‌టించిన `ఎంట‌ర్ ద డ్రాగ‌న్` చిత్రాన్ని సైకిల్ పై వెళ్లి చూసిన నేను విమానం ద్వారా చైనాలో అడుగు పెట్టి బ్రూస్‌లీ కాళ్ల ముందు `ఎంట‌ర్ ద గాళ్ డ్రాగ‌న్‌` ఇంట‌ర్నేష‌న‌ల్ ట్రైల‌ర్ని రిలీజ్ చేస్తున్నాను` అని ట్వీట్ చేసిన వ‌ర్మ ఇండియా తొలి మార్ష‌ల్ ఆర్ట్స్ ఫిల్మ్‌, బ్రూస్ లీ గాళ్ అనే హ్యాష్ ట్యాగ్‌లు పెట్టారు. `అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌బిడ్డ‌లు` సినిమ క‌లెక్ష‌న్‌ల గురించి ప్ర‌స్తావిస్తూ క‌లెక్ష‌న్‌ల రీసౌండ్ వినిపిస్తోంద‌ని, దీన్ని బ‌ట్టే ప్రేక్ష‌కులు కొత్త త‌రహా చిత్రాల్ని కోరుకుంటున్నార‌ని అర్థ‌మ‌వుతోంద‌ని ట్వీట్ చేశారు.

Credit: Twitter



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/34lBNsZ

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...