Skip to main content

దిల్ రాజు ఇద్దరి లోకం ఒకటే అలా సెట్టైంది

దిల్ రాజు ఇద్దరి లోకం ఒకటే అలా సెట్టైంది
దిల్ రాజు ఇద్దరి లోకం ఒకటే అలా సెట్టైంది

దిల్ రాజు.. టాలీవుడ్ లోనే అగ్రనిర్మాత. ఈ ఏడాది రెండు బంపర్ హిట్లు కొట్టిన దిల్ రాజు, హ్యాట్రిక్ విజయాలతో ఈ సంవత్సరానికి స్వస్తి చెప్పాలని అనుకుంటున్నాడు. ఈ ఏడాది దిల్ రాజు నిర్మించిన ఎఫ్ 2, మహర్షి ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండు సినిమాలూ కూడా దిల్ రాజుకు బానే లాభాలు తీసుకొచ్చాయి. ఇక మూడో సినిమాగా రాజ్ తరుణ్ హీరోగా ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాను నిర్మించాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. సెన్సార్ కూడా అయిపోయి కొన్ని వారాలు అవుతోంది. కానీ సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తూ సినిమాను అలానే ఉంచేసాడు. ఫైనల్ గా డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు దిల్ రాజు.

ప్రస్తుతం రాజ్ తరుణ్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఈ యంగ్ హీరో హిట్ కొట్టి చాలా కాలమైంది. దిల్ రాజు.. రాజ్ తరుణ్ ను హీరోగా పెట్టి తెరకెక్కించిన లవర్ దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఈ సినిమా దిల్ రాజు తీసుకున్న బ్యాడ్ డెసిషన్స్ లో ఒకటి. బడ్జెట్ ను ఎప్పుడూ కంట్రోల్ లో పెట్టుకునే దిల్ రాజు, ఈ సినిమాకు మాత్రం ఈ విషయంలో ఘోరంగా విఫలమయ్యాడు. పెద్ద సినిమాలను కూడా ఎంతో క్లారిటీగా నిర్మించి, పక్కా ప్రణాళికతో సినిమాలను రిలీజ్ చేస్తుంటాడు, కానీ లవర్ విషయంలో మాత్రం లెక్కలన్నీ తప్పాయి. బడ్జెట్ పరిమితులు దాటి వెళ్ళిపోయింది. బిజినెస్ కూడా అనుకున్న రేంజ్ లో జరగలేదు. ఫైనల్ గా సినిమా కూడా అటకెక్కింది.

రాజ్ తరుణ్ తో పెద్ద ప్లాప్ కొట్టినా కానీ మళ్ళీ తనతోనే సినిమాను నిర్మించాడు దిల్ రాజు. ప్రస్తుతం అసలు మార్కెట్ లేని రాజ్ తరుణ్ తో దిల్ రాజు ఎందుకు సినిమా నిర్మించాడా అన్నది ఎవరికీ అంతుచిక్కలేదు. దీనికి రీసెంట్ గా సమాధానమిచ్చాడు ఈ అగ్రనిర్మాత. దిల్ రాజుకు తెలియకుండా ఇద్దరి లోకం ఒకటే కథ విన్న రాజ్ తరుణ్, దిల్ రాజు వద్దకు వెళ్లి ఈ సినిమా చేస్తానని అడిగాడట. ఈ చిత్ర దర్శకుడు జీఆర్ కృష్ణ ఒక టర్కీ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ కథను రాసుకున్నాడని, అయితే దాన్ని మన నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసి సిద్ధం చేశామని, అప్పుడే రాజ్ తరుణ్ వచ్చి అడగడంతో అతనితోనే ముందుకెళ్లినట్లు తెలిపాడు.

చిన్నప్పటినుండి కలిసి పెరిగిన హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ ఎలా చిగురించింది. వారి మధ్య వచ్చిన మనస్పర్థలు ఎలాంటివి, చివరికి ఎలా ఒకటయ్యారు అనే పాయింట్ మీద ఈ చిత్రం తెరకెక్కిందిట. చూస్తుంటే ఇదేమి ఫ్రెష్ ఐడియా కాదు. నువ్వే కావాలి, ఆనందం తరహాలో ఉన్న లవ్ స్టోరీ అనిపిస్తోంది. అయితే ట్రీట్మెంట్ సరికొత్తగా ఉంటుందని దిల్ రాజు నమ్మకంగా ఉన్నాడు. చూడాలి మరి రాజు గారు ఈ ఏడాది హ్యాట్రిక్ కొడతారో లేదో.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/363PkGU

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...