ప్రపంచం మొత్తం ఇప్పుడు డబ్బు చుట్టు తిరుగుతోంది అనుకుంటారు అది పచ్చి అబద్ధం. డబ్బు మూటల వెనకున్న ఈగో ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది. దాన్ని సాటిస్‌ఫై చేస్తూ చాలా మంది పెద్దలు తమ అవసరాల్ని తెలివిగా తీర్చుకుంటున్నారు. ప్రతీ రంగంలో ఈగో పట్టింపులు వున్నట్టే సినీ రంగంలోనూ వున్నాయి. అయితే ఇక్కడ వాటిదే అగ్ర తాంబూలం. దాని ఆధారంగానే ఇక్కడ ఏ పనైనా చక చకా జరిగిపోతుంటుంది. అదే చెడితే రచ్చ రంబోలానే.
ఇండస్ట్రీలో ఇద్దరు బడా నిర్మాతలు. అయినా వాళ్ల మధ్య ఈగో క్లాషెస్ మొదలయ్యాయి. చిన్న అమౌంటే ఆ ఈగోలకి కారణం. కానీ చివరికి తన పంతాన్ని నెగ్గించుకుని ఆ ఇద్దరిని పోలీస్ స్టేషన్ మెట్లెక్కించింది. చివరికి వార్తల్లోకి ఎక్కేలా చేసింది. ఇంతకీ ఈగోతో రోడ్డెక్కిన ఆ ఇద్దరు నిర్మాతలు ఎవరు?.. ఏమా ఈగో కథ? అనుకుంటున్నారా? ఆ ఇద్దరు బడా నిర్మాతలు మరెవరో కాదు ఒకరు రీసెంట్‌గా తెలుగు చలన చిత్ర పరిశ్రమ సగౌరవంగా తలెత్తుకునేలా చేసిన క్రేజీ దర్శకుడితో భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత. మరొకరు కొడుకులని హీరోలుగా నిలబెట్టే పనిలో బిజీగా వున్న వివాదాస్పద నిర్మాత.
ఈ ఇద్దరి మధ్య 80 లక్షలు వివాదాన్ని తెచ్చింది. ఓ బడా నిర్మాత వివాదాలే తన ఎదుగు దలకు సోపానంగా చేసుకున్న నిర్మాతకు 80 లక్షలు బాకీ ఇచ్చారట. అయితే ఆ మొత్తం ఇవ్వడానికి చాలా కాలంగా వివాదాస్పద నిర్మాత మొరాయిస్తున్నారట. దీంతో ఈగో హర్ట్ అయిన బడా నిర్మాత తన బాకీ వసూలు కోసం సదరు నిర్మాతపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. వివాదాల నిర్మాతగా పేరున్న నిర్మాత మళ్లీ ఈగోకి వెళ్లి సమస్యను జఠిలం చేస్తారో లేక రాజీకి వచ్చి తను ఇవ్వాల్సిన డబ్బులను తిరిగి ఇచ్చేస్తారో చూడాలి అంటున్నారు సినీ జనం.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2SnVqye
Comments
Post a Comment