Skip to main content

అల వైకుంఠపురములో.. బుట్ట బొమ్మ.. మరో బాపు బొమ్మ అవుతుందా?

అల వైకుంఠపురములో.. బుట్ట బొమ్మ.. మరో బాపు బొమ్మ అవుతుందా?
అల వైకుంఠపురములో.. బుట్ట బొమ్మ.. మరో బాపు బొమ్మ అవుతుందా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం అల వైకుంఠపురములో మొదటినుండి అంచనాలు నెలకొల్పడంలో కొత్త రికార్డులను సృష్టిస్తోంది. మొదటి పాటతోనే ఈ చిత్రం దుమ్ము రేపింది. సామజవరగమన అనే పాట అప్పటిదాకా తెలుగు సాంగ్స్ పరంగా ఉన్న రికార్డులను వ్యూస్ పరంగా, లైక్స్ పరంగా కూడా తిరగరాసింది. అత్యంత ఫాస్ట్ గా 100 మిలియన్ వ్యూస్ కు చేరుకున్న ఈ పాట ఇంకా క్రేజ్ తగ్గకుండా వ్యూస్ విషయంలో కుమ్మేస్తోంది. ఇక రెండో పాట రాములో రాముల కూడా అదే రేంజ్ హిట్ అని చెప్పాలి. ఈ పాట కూడా 100 మిలియన్ వ్యూస్ వైపు దూసుకుపోతోంది. మరో వారం రోజుల్లో ఈ ఫీట్ అందుకోవచ్చు. మూడో పాట ఓ మై గాడ్ డాడీ కూడా ఆ రేంజ్ కాకపోయినా సక్సెస్ అయితే అయింది.

ఈ కోవలోనే ఈ చిత్రంలోనుండి నాలుగో పాటను రేపు విడుదల చేయబోతున్నారు. బుట్ట బొమ్మ అనే పాట 18న విడుదల అవుతుందని తెలిపారు మేకర్స్. బుట్ట బొమ్మ అనే పదం వినగానే అందరికీ అత్తారింటికి దారేది లోని బాపు బొమ్మ పాట గుర్తుకురావడం సహజం. ఈ చిత్రంలో బాపు బొమ్మ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రణీతకు బాపు బొమ్మ అనే టైటిల్ ఫిక్స్ అయిపోయింది. ఆమెను ఇప్పటికీ వర్ణించాల్సిన సందర్భాల్లో బాపు బొమ్మ అనే పిలుస్తారు.

ఇప్పుడు అల వైకుంఠపురములో విషయానికి వస్తే బుట్ట బొమ్మ పాట కూడా ఆ రేంజ్ హిట్ అవుతుందన్న నమ్మకాలూ అయితే ఉన్నాయి. అయితే పూజ హెగ్డే కూడాకు బుట్ట బొమ్మ అనే పదం అలాగే అటాచ్ అవుతుందా అన్నది చూడాలి. ఇక పూజ హెగ్డే ఈ పాట విడుదల సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో నిజంగానే బుట్టబొమ్మలా ఉంది. మరి పాట విడుదలైన తర్వాత ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

పాట విషయంలోనే కాకుండా టీజర్ విషయంలో.. అందులో వాడిన కొన్ని షాట్స్ పరంగా చూసినా కూడా అత్తారింటికి దారేది సినిమా గుర్తొస్తోంది. మరి సినిమా కూడా ఆ రేంజ్ హిట్ ను అందుకుంటుందా? త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు. ఎస్ రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతోంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Pqky5H

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...