`కొత్త బంగారు లోకం` చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది బీహార్ చిన్నది శ్వేతా బసు ప్రసాద్. తొలి చిత్రంతోనే క్రేజీ కథానాయికగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. తొలి హిట్‌తోనే ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన శ్వేతా ఆ తరువాత చిత్రాల్లో మాత్రం ఆ స్థాయిలో మెస్మరైజ్ చేయలేకపోయింది. మక్డీ, ఎక్బాల్ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రశంసలు అందుకున్న శ్వేతా ఆ తరువాత కాస్కో, రైడ్, కళావర్ కింగ్, ప్రియుడు, ఉదయ్‌కిరణ్‌తో `నువ్వెక్కడుంటే నేనక్కడుంటా వంటి చిత్రాల్లో నటించింది.
బాలీవుడ్‌లోనూ వరుస క్రేజీ చిత్రాల్లో నటించిన శ్వేత ఓ సంఘటన కారణంగా తెలుగులో పూర్తిగా మార్కెట్ ను కోల్పోయింది. ఫిల్మ్‌మేకర్ రోహిత్ మిత్తల్‌ని గత ఏడాది డిసెంబర్‌లో వివాహం చేసుకుని షాకిచ్చిన శ్వేత ఏడాది తిరగకుండానే తన వైవాహిక జీవితానికి వీడ్కోలు పలకడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల యువ నిర్మాత రోహిత్ మిత్తల్‌తో విడిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా శ్వేతా బసు ప్రసాద్ వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.
కొన్ని ప్రయాణాల్ని మధ్యలోనే ఆపేయాలి. అలాంటి అవసరం వచ్చినప్పుడు అలా చేయడం తప్పనిసరి. అందుకే రోహిత్ మిత్తల్‌తో విడిపోయాను` అని శ్వేతా బసు ప్రసాద్ స్పష్టం చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏడాది తిరక్కుండానే వివాహ బంధాన్ని రద్దు చేసుకోవడం వెనుక బలమైన కారణం ఏమై వుంటుందా? అని అంతా ఆరా తీస్తున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/38oGbLm
Comments
Post a Comment