రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్‌కి ఏ మాత్రం తగ్గని స్థాయిలో `ఫైటర్` సినిమాని తెరపైకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ `డియర్ కామ్రేడ్` చిత్రం తరువాత డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో ఓ సినిమాని లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే. `ఫైటర్` పేరుతో తెరపైకి రాబోతున్నఈ సినిమా సెట్స్ పైకి రాకుండానే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటి వరకు టాలీవుడ్ వరకు పరిమితమైన తన కెరీర్‌ని, క్రేజ్‌ని దేశ వ్యాప్తం చేయాలని, పాన్ ఇండియా స్థాయి స్టార్‌గా పేరు తెచ్చుకోవాలని విజయ్ ప్లాన్ చేసుకుంటున్నారు.
పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఇందు కోసం ఇప్పటికే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్‌జోహార్‌ని రంగంలోకి దించారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పూరి, చార్మి ప్రొడ్యూసర్ కరణ్‌జోహర్‌తో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ చిత్రంతో అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వికపూర్‌ని తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నారన్నది మరో వార్త. ఇప్పటికూ జాన్వీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసిందని ప్రచారం జరుగుతోంది.
మైక్ టైసన్‌ని కూడా బరిలోకి దించాలని ప్లాన్ చేస్తున్న పూరి ఈ సినిమా కోసం మరో బాలీవుడ్ సుందరి నటించే అవకాశం వుందని, చార్మి ముంబైలో ప్రస్తుతం అదే పనుల్లో వుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్ని పూరి, చార్మి అఫీషియల్‌గా వెల్లడించనున్నారట. వచ్చే ఏడాది అంటే జనవరి మొదటి వారంలోనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లని చార్మి చకచకా చేసేస్తోంది.
విజయ్ దేవరకొండ, ఫైటర్, పూరి జగన్నాథ్, vijay deverakonda, fighter, puri jagannath,
one more bollywood beauty in vijay devarakonda film
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/34HX3JX
Comments
Post a Comment