టాలీవుడ్ కు ఓవర్సీస్ కూడా ఒక మార్కెట్ కాగలదని అప్పట్లో ఎవరూ అనుకోలేదు. ఏదో మొక్కుబడికి చాలా తక్కువ సెంటర్లలో అక్కడ సినిమాలు విడుదల చేసేవారు. అయితే నెమ్మదిగా అక్కడ పరిస్థితిలో మార్పు వచ్చింది. క్రమంగా 1 మిలియన్ అటు నుండి 2 మిలియన్ డాలర్లు కూడా వచ్చాయి కొన్ని సినిమాలకు. ఇక 3 మిలియన్ అందుకున్న సినిమాలు కూడా ఉండగా బాహుబలి 2 అయితే ఎవరికీ అందనంత ఎత్తులో 12 మిలియన్ డాలర్లు సంపాదించింది. హీరోల్లో చూసుకుంటే మహేష్ బాబు సినిమాలకు ఓవర్సీస్ లో మార్కెట్ బాగుంటుంది. ఎలాంటి సినిమా అయినా అక్కడ తనవి 1 మిలియన్ డాలర్స్ దాటేస్తాయి.
అయితే రెండు మూడేళ్ళ క్రితం టాలీవుడ్ పరిస్థితి చాలా బాగుండేది. కచ్చితంగా అక్కడ సినిమాలతో కలెక్షన్స్ బానే వచ్చేవి. అయితే మనవాళ్ళ అత్యుత్సాహం ఓవర్సీస్ మార్కెట్ పై పూర్తిగా ప్రభావం చూపించింది. నిజానికి ఓవర్సీస్ లో వసూళ్లు ఎక్కువ వచ్చినా టాక్స్ కటింగ్స్ అన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ కు మిగిలేది చాలా తక్కువ. మార్జిన్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఓవర్సీస్ మార్కెట్ పై ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు పెద్దగా దృష్టి పెట్టింది లేదు. కానీ అక్కడ హైప్ పెంచడం కోసం ఇక్కడి నిర్మాతలు కొంతమంది కావాలని అక్కడేదో అద్భుతం జరిగిపోతున్నట్లు ఎక్కువ డబ్బులు మిగిలిపోతున్నట్లు కలరింగ్ ఇవ్వడంతో అక్కడి బిజినెస్ పెరిగిపోయింది. అది నిర్మాతలకు లభమైంది తప్ప డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతూనే వచ్చారు. పెద్ద హీరో సినిమాకు 2 మిలియన్ డాలర్స్ వచ్చినా లాభాల్లోకి రాలేనంత అమౌంట్ కు బిజినెస్ చేసేసేవారు. దాంతో ఓవర్సీస్ లో తెలుగు సినిమాలు వరసగా నష్టాలు చవిచూస్తూ వచ్చాయి. మొదట్లో ఓవర్సీస్ మార్కెట్ నైజాంను మించిపోయిందనే రేంజ్ లో కలరింగ్ ఇచ్చేవాళ్ళు.
ఇప్పుడు పరిస్థితికి చూసుకుంటే పెద్ద హీరోల సినిమాలు కూడా అక్కడ నష్టాలను తీసుకురావడంతో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు అందరూ వరసగా నష్టాలను చవిచూశారు. ఇప్పుడు పరిస్థితిలో క్రమంగా మార్పు కనిపిస్తోంది. అక్కడ ఎక్కువ డబ్బులు పెట్టేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ఎక్కువ ఆసక్తి చూపించట్లేదు. ఇదంతా ఒకెత్తు అయితే నిజంగా హిట్ అయిన సినిమాలకు కూడా సరిగ్గా లెక్కలు చెప్పకుండా తప్పించుకు తిరిగే జనాలుఉన్నారు. అందుకే ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు అక్కడ ఒక వింగ్ ఏర్పాటు చేసి కలెక్షన్స్ ను పారదర్శకంగా ఉండేలా జాగ్రత్త వహించేలా చూడనున్నారట. దీనివల్ల మిగిలిన డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఓవర్సీస్ లో అసలు ఏం జరుగుతోందనే విషయంలో క్లారిటీ ఉంటుంది. మొత్తానికి బంగారు బాతు గుడ్డులా మారే ఓవర్సీస్ మార్కెట్ ను చంపేసే పరిస్థితి నుండి ఇప్పుడిప్పుడే బ్రతికించుకునే దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2rgxx0D
Comments
Post a Comment