టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల ఫ్యాన్స్ అభిమాన సంఘాల పేరుతో కొట్టుకుంటుంటే హీరోలు మాత్రం ఆరోగ్యకరమైన వాతావరణంలో కలిసిపోతూ ఫ్రెండ్లీ నేచర్‌తో మిగతా ఇండస్ట్రీల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పబ్బుల్లో ప్రత్యేకంగా పార్టీలు చేసుకుంటూ తమ మధ్య వున్న స్నేభ బంధాన్ని తెలియజేస్తున్నారు. ఇటీవల ఒక స్టార్ హీరో ప్రీరిలీజ్ ఈ వెంట్‌కు మరో స్టార్ హీరో చీఫ్ గెస్ట్‌గా రావడం అలవాటుగా మారిపోయింది.
ఆ మధ్య మహేష్ నటించిన `భరత్ అనే నేను` ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా రావడం అటు నందమూరి అభిమనుల్ని, ఇటు మహేష్ అభిమానుల్ని ఆశ్చర్యానికి ఆనందానికి లోనయ్యేలా చేసింది. తాజాగా మహేష్ నటిస్తున్న `సరిలేరు నీకెవ్వరు` ప్రీరిలీజ్ ఈ వెంట్‌కి మెగా హీరో ముఖ్య అతిధిగా రాబోతున్నారు. సరిలేరు నీకెవ్వరు` ప్రీరిలీజ్ ఈ వెంట్ జనవరి 5న ఎల్బీ స్టేడియంలో జరగబోతోంది. ఈ కార్యక్రమానికి మెగా హీరో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హాజరు కానున్నట్టు తాజా సమాచారం.
ఇప్పటికే ఈ చిత్ర నిర్మాతలు మెగా హీరో రామ్‌చరణ్‌ని సంప్రదించారని, ప్రీరిలీజ్ ఈవెంట్‌కి రావడానికి రామ్‌చరణ్ సుముఖతను వ్యక్తం చేశారని తెలిసింది. మహేష్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్న `సరిలేరు నీకెవ్వరు` జనవరి 11న విడుదల కాబోతోంది. విజయశాంతి, ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2sHBiMT
Comments
Post a Comment