Skip to main content

ప్రతిరోజూ పండగే మూవీ రివ్యూ

ప్రతిరోజూ పండగే మూవీ రివ్యూ
ప్రతిరోజూ పండగే మూవీ రివ్యూ

మూవీ రివ్యూ: ప్రతిరోజూ పండగే
నటీనటులు: సాయి తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్, సుహాస్ తదితరులు
దర్శకత్వం: మారుతి
నిర్మాణం: బన్నీ వాసు, అల్లు అరవింద్
సంగీతం: ఎస్ ఎస్ థమన్
విడుదల తేదీ: డిసెంబర్ 20, 2020
రేటింగ్: 3/5

ఈ ఏడాది చిత్రలహరి వంటి డీసెంట్ హిట్ తో ప్లాపుల నుండి ఊరట పొందిన తేజ్, మంచి ఎంటర్టైనింగ్ సినిమాలు తీస్తాడన్న పేరు తెచ్చుకున్న మారుతితో కలిసి ప్రతిరోజూ పండగే చేసాడు. కుటుంబ విలువలు, ప్రతిరోజూ మన జీవితం పండగలా మారాలంటే ఎలా అన్న కాన్సెప్ట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:
ఈ కథ ట్రైలర్ లో చూపించినదే. రఘురామయ్య (సత్యరాజ్) మనవళ్ళు, మనవరాళ్లు అందరూ యూఎస్, ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోతారు. ఇదిలా ఉంటే రఘురామయ్యకు లంగ్ క్యాన్సర్ ఉన్నట్లు తెలుస్తుంది. ఎక్కువ కాలం బ్రతకడని డాక్టర్లు చెబుతారు. ఈ నేపథ్యంలో తన తాతకు తీరకుండా ఉండిపోయిన కోరికలను తీర్చడానికి దిగుతాడు మన హీరో. అక్కడి నుండి కథ ఎలాంటి మలుపులు తీసుకుంది అన్నది మిగతా సినిమా.

నటీనటులు:
సాయి తేజ్ తన చలాకీ నటనతో మెప్పించాడు. సినిమా అంతటా ఎనర్జిటిక్ గా కనిపించాడు. ఎమోషనల్ సీన్లలో కూడా తేజ్ నటన ఆకట్టుకుంటుంది. రాశి ఖన్నా చూడటానికి బాగుంది. తనకు సరదాగా ఉండే పాత్ర పడింది. వందకు వంద శాతం న్యాయం చేసింది. టిక్ టాక్ స్టార్ గా ఆమె మంచి హ్యూమర్ ను పంచింది. గ్లామరస్ గానూ కనిపించింది. రావు రమేష్ ఈ సినిమాకే హైలైట్ అనదగ్గ పాత్ర చేసాడు. సినిమాలో సాయి తేజ్, సత్యరాజ్ మెయిన్ అనుకుంటాం కానీ రావు రమేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాడు. సత్యరాజ్ తన పాత్రకు జీవం పోసాడు. కుటుంబ బంధాలను కోరుకునే చరమాంకంలోని వ్యక్తిగా సత్యరాజ్ ఆకట్టుకుంటాడు. మిగిలిన వారంతా మామూలే.

సాంకేతిక వర్గం:
థమన్ తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాడు. పాటలు అన్నీ కూడా ఆకట్టుకునేలా లానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మెయిన్ హైలైట్ గా నిలిచింది. ఫ్రేమ్స్ అన్నీ కలర్ గుల్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు అదిరిపోయాయి. సంభాషణలు మెప్పిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ డైలాగులు అందరినీ ఆలోజింపచేస్తాయి. యాక్షన్ సీక్వెన్స్ లు బాగా డిజైన్ చేసారు. సాయి తేజ్ కు కంపోజ్ చేసిన డ్యాన్సులు కూడా బాగున్నాయి. స్టోరీ లైన్ సింపుల్ గా ఉన్నా ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు మారుతి దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు అనిపిస్తుంది. హార్ట్ టచింగ్ మూమెంట్స్ మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది.

విశ్లేషణ:
మారుతి అనగానే అతని సింపుల్ బట్ ఎఫెక్టివ్ ఎంటర్టైనింగ్ సినిమాలే గుర్తొస్తాయి. మొదటి హాఫ్ ను ఎంటర్టైనింగ్ వే లోనే నడిపించిన దర్శకుడు, సెకండ్ హాఫ్ లో ఒక స్టేజ్ వచ్చాక ఏం చేయాలో అర్ధం కానట్లు సినిమాను తీసుకెళ్లాడు. అటు కామెడీ వైపు వెళ్ళాలో, ఇటు సెంటిమెంటల్ గా సినిమాను ముందుకు తీసుకెళ్ళాలో తెలియక రెండిటికీ కాకుండా చేసేసాడు. ఏదేమైనా మొదటి హాఫ్ లో వచ్చే ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, సెకండ్ హాఫ్ లో కొంత భాగం మెప్పిస్తాయి. మొత్తంగా ప్రతిరోజూ పండగే.. ఊహించినంత రేంజ్ లో లేకపోయినా ఒకసారి చూడవచ్చు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/396FmHo

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...