Skip to main content

సంక్రాంతి పుంజుల ప్రీ రిలీజ్ బిజినెస్ విశేషాలేంటి?

సంక్రాంతి పుంజుల ప్రీ రిలీజ్ బిజినెస్ విశేషాలేంటి?
సంక్రాంతి పుంజుల ప్రీ రిలీజ్ బిజినెస్ విశేషాలేంటి?

సినిమాల పరంగా చూసుకుంటే సంక్రాంతి సినిమాలకే ఎక్కువ సందడి ఉంటుంది. భారీ సినిమాలు విడుదలయ్యే సీజన్ కాబట్టి కొన్ని వందల కోట్ల చేతులు మారుతుంటాయి. సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది సినిమాలే. ఈసారి కూడా సంక్రాంతి ఎక్కడా తగ్గట్లేదు. టాలీవుడ్ లో మరింత ఘనంగా ఉండబోతోంది. మహేష్ బాబు, అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ వద్ద తలపడుతుండడం ఈ సంక్రాంతికి స్పెషల్ హైలైట్. ఇంకా నందమూరి కళ్యాణ్, రజినీకాంత్ సినిమాలు కూడా ఈ సంక్రాంతికే రానున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ సంక్రాంతికి దాదాపుగా 400 కోట్ల బిజినెస్ జరగబోతోందని సమాచారం. థియేట్రికల్ డీల్స్ తో నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలుపుకుంటే వచ్చే అమౌంట్ ఇది. ఆ పది రోజుల మొత్తానికి జరిగిన డీల్స్ ఇవి. జనవరి 10 నుండి మొదలయ్యే సందడి దాదాపు జనవరి నెలాఖరు వరకూ కొనసాగుతుంది. జనవరి మొత్తం లెక్కేసుకుంటే దాదాపు 600 కోట్ల మేర బిజినెస్ డీల్స్ జరుగుతున్నాయి.

ముందే చెప్పుకున్నట్లు ఫోకస్ మొత్తం మాత్రం అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలపైనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తలపడడమే కాకుండా ప్రమోషన్స్ పరంగానూ పోటీ పడుతుండడం నిజంగా హైలైట్. ప్రతీ అప్డేట్ ఇవ్వడానికి రెండు సినిమాల మధ్య టఫ్ కాంపిటీషన్ నడుస్తోంది. ఇది సినీ ప్రేమికులకు భలేగా నచ్చుతోంది. సరిలేరు నీకెవ్వరు చిత్ర విశేషాల విషయానికొస్తే ఈ సినిమాకు దాదాపుగా 80 కోట్లు ఖర్చవుతుంటే 110 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అంటే సరిలేరు నీకేవ్వరు హిట్ అవ్వాలంటే షేర్ మాత్రమే 120 కోట్ల దాకా రావాలి. సంక్రాంతి కాంపిటీషన్ మధ్య ఈ సినిమా అంత వసూలు చేయగలదా అన్నదే ఇంపార్టెంట్.

ఇక ఈ చిత్ర ట్రైలర్ ను డిసెంబర్ 31న సాయంత్రం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 5న కండక్ట్ చేయనున్నారట. దీనికి ఒక స్పెషల్ గెస్ట్ ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అల వైకుంఠపురములో విషయానికొస్తే బిజినెస్ డీల్స్ పరంగా సరిలేరుతో సమానంగానే ఉంది. ఈ చిత్రానికి కూడా 80-85 కోట్ల వరకూ బడ్జెట్ అయినట్లు సమాచారం. థియేట్రికల్ బిజినెస్ కూడా 100 కోట్లపైనే అయింది. అయితే ఏరియా వైజ్ బ్రేకప్ వస్తే అసలు ఫిగర్స్ బయటకొచ్చి ఏ హీరో సత్తా ఎంతనేది తెలుస్తుంది. మరి అప్పటిదాకా వేచి ఉండాల్సిందే. అల వైకుంఠపురములో ట్రైలర్ కూడా డిసెంబర్ 31నే రానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి మొదటి వారంలో నిర్వహిస్తారు. తారక్ ఇప్పటికే ఈ ఈవెంట్ కు హాజరుకానున్నాడని తేలిపోయింది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PGgUDJ

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...