టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిచిలర్స్ చాలా మందే వున్నారు. ప్రభాస్, రానా, నితిన్, శర్వానంద్, వరుణ్‌తేజ్, సాయిధరమ్‌తేజ్…ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వుంది. అయితే ఈ లిస్ట్‌లో వున్న ఓ యంగ్ హీరో త్వరలో ప్రేమ పెళ్లికి సిద్ధమవుతున్నాడని టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొంత కాలంగా ఓ తెలగమ్మాయితో ప్రేమలో వున్న సదరు యంగ్ హీరో త్వరలో ఆమెని పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరా? అని అంతా ఆరా తీస్తున్నారు. ఆ హీరో మరెవరో కాదు నితిన్. తాజాగా వెంకీ కుడుముల రూపొందిస్తున్న `భీష్మ` చిత్రంలో నటిస్తున్నారు. నితిన్ తను ప్రేమిస్తున్న అమ్మాయిని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని, గత కొంత కాలంగా నితిన్‌ని ఆయన తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని కోరుతున్నారు. అయితే తాజాఆ నితిన్ నిర్ణయం వారికి కూడా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారట. త్వరలోనే నితిన్ తన పెళ్లికి సంబంధించిన వార్తని అధికారికంగా ప్రకటించే అవకాశం వుందని తెలిసింది.
అలాగే నితిన్ తన పెళ్లి గురించి భారీగానే ప్లాన్ చేసుకుంటున్నారట. ఇష్టసఖితో పెళ్లి జరగబోతోంది కాబట్టి వికాట్ కోహ్లీ, అనుష్క తరహాలో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేసుకున్నట్టు చెబుతున్నారు. దబాయ్‌లో బంధు మిత్రులు, పరిశ్రమకు చెందిన స్టార్స్ మధ్య నితిన్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ తరువాత హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ని ఏర్నాటు చేస్తారట. నితిన్ హీరోగా నటిస్తున్న ఫిబ్రవరి 21న విడుదల కానుంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PmFhao
Comments
Post a Comment