Skip to main content

పవన్ పంచ్ డైలాగులతో పింక్ రీమేక్

పవన్ పంచ్ డైలాగులతో పింక్ రీమేక్
పవన్ పంచ్ డైలాగులతో పింక్ రీమేక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను ఒక్కసారి పరిశీలిస్తే తను చాలా యాక్టివ్ గా నటించిన సినిమాలు అన్నీ సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. అదే సీరియస్ కథను సటిల్ గా చేయాలని చూస్తే అవి ప్రేక్షకుల నుండి తిరస్కరణ పొందాయి. ఆ విషయాలను దృష్టిలో ఉంచుకునే ఇప్పుడు పింక్ రీమేక్ ను తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. హిందీలో తెరకెక్కిన పింక్ చిత్రంలో అమితాబ్ బచ్చన్ పాత్ర చాలా సీరియస్ గా ఉంటుంది. అంతే కాకుండా చాలా తక్కువగా మంద్ర స్వరంతో పలుకుతుంది. కోర్ట్ రూమ్ సీన్స్ లో అయితే ఏదో తడబడుతున్నట్లుగా ముందు ఆ పాత్ర ప్రవర్తిస్తుంది. ఒక మానసిక సమస్యతో బాధపడుతుంటుంది. అలాగే తన భార్య కూడా అనారోగ్య సమస్యలతో సతమతమవుతుండడం ఇబ్బంది పెడుతుంది. పింక్ సినిమాకు ఆ సెటప్ పనిచేసింది. పింక్ తమిళ్ రీమేక్ లో కూడా ఈ విధమైన సెటప్ ఉంటుంది. అజిత్ పాత్ర చాలా వరకూ అండర్ ప్లే చేస్తుంది. సీరియస్ గానే అతని పాత్ర సాగుతుంది. అక్కడ కూడా ఈ సెటప్ పనిచేసింది. నెర్కొండ పర్వాయ్ అక్కడ కూడా సూపర్ హిట్ అయింది.

అయితే తెలుగులోకి వచ్చేసరికి దీన్ని పూర్తిగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ పింక్ రీమేక్ కు తెలుగులో చాలానే మార్పులు జరిగినట్లు తెలిపాడు. ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇందులో పవన్ పాత్ర ఎక్కడా అండర్ ప్లే అన్నదే ఉండదట. మొదటి నుండి ఆ పాత్ర చాలా యాక్టివ్ గా సాగుతూ పంచ్ డైలాగులు పేలుస్తూ సాగుతుందని తెలుస్తోంది. ఇది కమర్షియల్ సబ్జెక్ట్ కాకపోయినా వీలైనంత సోల్ ను చెడకొట్టకుండా పవన్ అభిమానులకు నచ్చే విధంగా స్క్రిప్ట్ ను మార్చారట.

మరి ఈ మార్పులు అన్నీ ఎంత వరకూ వర్కౌట్ అవుతాయో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకూ వెయిట్ చేయాల్సిందే కదా. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. మార్చ్ నెలాఖరు కల్లా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలన్న ప్రణాళికతో పింక్ రీమేక్ టీమ్ ముందుకెళుతోంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2vSIbwz

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...