Skip to main content

`ల‌వ్‌స్టోరీ` నుంచి `హేయ్ పిల్లా.. వ‌చ్చేస్తోంది!

`ల‌వ్‌స్టోరీ` నుంచి `హేయ్ పిల్లా.. వ‌చ్చేస్తోంది!
`ల‌వ్‌స్టోరీ` నుంచి `హేయ్ పిల్లా.. వ‌చ్చేస్తోంది!

`ఫిదా` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌తో సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల మ‌ళ్ళీ ట్రాక్‌లోకి వ‌చ్చారు. ఈ సినిమా ఆయ‌న కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ని సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా 50 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి నిర్మాత దిల్ రాజుకు భారీ లాభాల్ని తెచ్చిపెట్టింది. దీంతో ద‌ర్శ‌కుడిగా శేఖ‌ర్ క‌మ్ముల రేంజ్ పెరిగింది. అయినా స‌రే త‌న సెన్సిబిలిటీస్‌ని ప‌క్క‌న పెట్టి సినిమా చేయ‌డానికి అంగీక‌రించ‌ని ఆయ‌న తాజాగా మ‌రో బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ ల‌వ్‌స్టోరీని తెర‌పైకి తీసుకొస్తున్నాడు.

నాగ‌చైత‌న్య హీరోగా, `ఫిదా` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఫిదా చేసిన సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా `ల‌వ్‌స్టోరీ` పేరుతో శేఖ‌ర్ క‌మ్ముల ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో చై ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడిగా అత్యంత స‌హ‌జ‌త్వంతో కూడిన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఇటీవ‌లే టైటిల్ లుక్‌ని రిలీజ్ చేసిన మేక‌ర్స్ ఈ నెల 13న ఈ చిత్రానికి సంబంధించిన తొలి సింగిల్ ` హే పిల్లా ` అంటూ సాగే సాంగ్‌ని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసి పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. నాగ‌చైత‌న్య ప‌క్క‌న న‌డుస్తూ ముసి ముసి న‌వ్వులు రువ్వుతున్న సాయి ప‌ల్ల‌వి లుక్ అల‌రిస్తోంది.

తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి సిటీకి వ‌చ్చిన ఓ జంట క‌థ‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త‌న‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించిన నిజామాబాద్ పల్లెల‌నే ఈ చిత్రానికి శేఖ‌ర్ క‌మ్ముల ఎంచుకున్నారు. అయితే సినిమా ప్రేమ‌క‌థే అయినా సాడ్ ఎండింగ్ వుంటుంద‌ని, అది హృద‌యాల్ని పిండేసేలా వుంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అమిగోస్ క్రియేష‌న్స్ పై శేక‌ఱ్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌హిస్తూ పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు, నారాయ‌ణ్ దాస్ కె. నారంగ్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు స‌మ్మ‌ర్‌కు రిలీజ్ కానుంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2SBLT5f

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...