పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ మొదట ఒప్పుకున్న సినిమా పింక్ రీమేక్. ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు పెద్దగా సూట్ అవ్వని కథ. ఇందులో పవన్ రోల్ చాలా అండర్ ప్లే లో వెళ్తుంది. పైగా తన రోల్ మహా అయితే ఒక గంట పాటు ఉంటుంది. అందుకే పవన్ ఫ్యాన్స్ రీ ఎంట్రీ విషయంలో హ్యాపీగానే ఉన్నా పింక్ రీమేక్ కంటే దాని తర్వాత చేస్తోన్న క్రిష్ సినిమా విషయంలోనే ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే మొదలైన విషయం తెల్సిందే. అల్యూమినియం ఫ్యాక్టరీలో స్పెషల్ గా వేసిన సెట్ లో చిత్రీకరణ మొదలైంది.
ఈ సినిమాలో పవన్ బందిపోటుగా నటించనున్నాడన్న వార్తే అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎందుకంటే పీరియాడిక్ సెటప్ లో ఇంతవరకూ సినిమా చేసిందే లేదు, అందులోనూ పవర్ స్టార్ ఇలా బందిపోటు అంటే ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అన్న ఆత్రుత అభిమానులకు ఉంది. ఇక ఈ సినిమాలో పవన్ వీర అనే పాత్రలో నటిస్తాడన్న వార్త ఒకటి రీసెంట్ గా బయటకు వచ్చింది. అలాగే ఈ చిత్రానికి విరూపాక్షి అనే టైటిల్ ను కన్సిడర్ చేస్తున్నట్లు కూడా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ఒకరు కియారా అద్వానీ కాగా ఇంకొకరు కీర్తి సురేష్ అంటున్నారు. అయితే వీటిలో నిజమెంత ఉందో అనేది మాత్రం తెలీదు. ఏదేమైనా పవన్ – క్రిష్ ప్రాజెక్ట్ పై వార్తలు మాత్రం ఎక్కడా ఆగట్లేదు. రోజుకొకటి చొప్పున పుట్టుకొస్తున్నాయి.
ఇక ఈ సినిమా కోసం పవన్ రెండేళ్ల తర్వాత క్లీన్ షేవ్ లుక్ లోకి మారిపోవడం కూడా అభిమానులను సంతోషపెట్టింది. దాంతోపాటే ఈ సినిమాకోసం చేతి మీద టాటూ కూడా వేసుకున్నాడు పవన్. దాని గురించి కూడా సోషల్ మీడియాలో బాగా డిస్కషన్ నడిచింది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2usDqcO
Comments
Post a Comment