ఏపీ రాజకీయాల కారణంగా గత రెండేళ్లుగా సిమాలకు దూరంగా వుంటూ వస్తున్న పవన్‌కల్యాణ్ తాజాగా వరుస చిత్రాలతో స్పీడు పెంచిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్` రీమేక్‌తో మళ్లీ నటించడం మొదలుపెట్టిన పవన్ ఈ సినిమా తరువాత మరో మూడు చిత్రాలని కూడా మొదలుపెట్టే ఆలోచనలో వున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో ఓ పిరియాడిక్ చిత్రాన్ని సైలెంట్‌గా ప్రారంభించారు కూడా.
ఈ సినిమా తరువాత మరో రెండు లేదా మూడు చిత్రాల్ని తెరపైకి తీసుకురానున్నారట. ఇదిలా వుంటే తను అంటగీకరించిన చిత్రాలకు పారితోషికం తీసుకోకుండా వాటాలు అడుగుతున్నారని, ఆ రూపంలో పవన్‌కు ఒక్కో చిత్రానికి 40 నుంచి 50 కోట్ల వరకు అందే అవకాశం వుందని తాజా సమాచారం. తాజాగా భారీ మొత్తాన్ని అడ్వాన్స్‌గా తీసుకున్న పవన్‌కల్యాణ్ తన పిల్లలు అకీరా, ఆధ్యా కోసం కాస్ట్‌లీ గిఫ్ట్‌ని రెడీ చేయిస్తున్నారు. దీని ఖరీదు అక్షరాలా 5 కోట్లని తెలిసింది.
రేణూ దేశాయ్‌తో విడిపోయినా పిల్లల ఆలనా పాలనా పవనే చూస్తున్నారు. ఇందులో భాగంగా అకీరా, ఆధ్యాల కోసం ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని నిర్మాణం జరుగుతున్న జయభేరీ ప్రాజెక్ట్‌లో 5 కోట్ల విలువ చేసే ఓ ఫ్లాట్‌ని కొనుగోలు చేసినట్టు తెలిసింది. త్వరలోనే ఈ ఫ్లాట్‌ని అకీరా, ఆధ్యాలకు అందజేస్తారని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Hkr6hC
Comments
Post a Comment