గత కొంత కాలంగా బాలీవుడ్ టు టాలీవుడ్ బయోపిక్‌ల హంగామా నడుస్తోంది. తరహా చిత్రాలపై ప్రేక్షకుల్లోనూ ఆసక్తినెలకొనడంతో మేకర్స్ కూడా బయోపిక్‌లు నిర్మించడానికే అధిక ప్రాధాన్యత నిస్తున్నారు. తాజాగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవిత కథని తెరపైకి తీసుకురాబోతున్నారు. అయితే ఒకే బయోపిక్‌ని ఇద్దరు మేము నిర్మిస్తున్నామంటే మేమే నిర్మించాలి, నిర్మిస్తున్నాం అంటూ పోటీపడుతున్నారు.
అలీ కీలక పాత్రలో అబ్దుల్ కలాం జీవిత కథ ఆధారంగా ఇండో ఆమెరికన్ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జగదీష్ అనే వ్యక్తి ఈ చిత్రాన్నిరూపొందించబోతున్నాడు
ఈ సందర్భంగా `డాక్టర్ అబ్దులు కలాం` టైటిల్‌తో నిర్మించబోతున్న సినిమా పోస్టర్ ని సోమవారం అభిషేక్ అగర్వాల్ మీడియాకు రిలీజ్ చేశారు. `ఎవ్రీ స్టోరీ హ్యాజ్ ఏ హీరో` అనే క్యాప్షన్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని డ్రీమ్‌మర్చంట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సుంకర రామబ్రహ్మంతో కలిసి అభిషేక్ అగర్వాల్ నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలోనే వెల్లడించబోతున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/37brkBR
Comments
Post a Comment