సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన దగ్గరి నుంచి సాన్యులకు, సెలబ్రిటీలకు మధ్య దూరం తగ్గిపోయింది. సోషల్ మీడియా కారణంగా పక్కింట్లో వున్న వాళ్లని విండో.. లేదా పిట్టగోడెక్కి పలకరించినట్టుగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలని పలకరించడం, ప్రశ్నించడం, ట్రోల్స్ చేయడం నిత్యకృత్యంగా మారిపోయింది. ఇలాంటి వాతావరణంలో ఏవిషయంపై స్పందించాలన్నా సెలబ్రిటీలు, ముఖ్యంగా సినిమా వాళ్లు పది రకాలుగా ఆలోచిస్తున్నారు. అంత ఆలోచించి ఏదైనా పోస్ట్ పెట్టినా కొన్ని సార్లు అడ్డంగా బుక్కయిపోతున్నారు.
అలాంటి ఓ సంఘటనే హీరో మంచు మనోజ్‌కు తాజాగా ఎదురైంది. ఇటీవల భార్య ప్రణతితో విడిపోయిన మంచు మనోజ్ తనకు ఫైర్ బాల్ లా వెలిగిపోయే సమయం వచ్చిందని, ఓ ఆసక్తికరమైన వార్తని ఈ వారంలో అనౌన్స్ చేయబోతున్నానని, అంత వరకు ఎదురుచూడండని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే వారం దాటినా మనోజ్ నుంచి అప్‌డేట్ రాకపోవడంతో విసుగు పుట్టిన ఓ నెటిజన్ మనోజ్ భయ్యా వారం అంటే మీ దృష్టిలో 20 లేదా 30 వారాల తరువాతనా. ఆ అప్‌డేట్ ఏంటో త్వరగా చెప్పు అన్నా అని కౌంటరిచ్చాడు.
దీంతో షాక్ తిన్న మంచు మనోజ్ సదరు నెటిజన్‌కి సారీ చెప్పక తప్పలేదు. సారి తమ్ముడూ ఇంకొంచెం టైమ్ వేయిటింగ్ అంటే` అంటూ బదులిచ్చాడు. ఈ ఇద్దరి మధ్య సాగిన సరదా సంభాషణ నెటిజన్స్‌ని ఆకట్టుకుంటోంది. మంచు మనోజ్ త్వరలో ఓ సినిమాని అనౌన్స్ చేయబోతున్నారు. ఆ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. త్వరలోనే ఆ న్యూస్ బయటికి రాబోతోంది.
sorry thammudu …. inkkoncham time waiting anthe
https://t.co/4mDzBOsQnn
— MM*
(@HeroManoj1) February 11, 2020
Credit: Twitter
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/37iVjIq
sorry thammudu …. inkkoncham time waiting anthe 
Comments
Post a Comment