కమర్షియల్ సినిమా అంటే నాలుగు ఫైట్‌లు, హీరోయిన్‌తో రొమాంటిక్ సీన్‌లు, ఆరు పాటలు. అయితే ఈ ఫార్ములాని బ్రేక్ చేసిన చిత్రం `ఖైదీ`. కార్తీ హీరోగా లోకేష్ కనకరాజ్ రూపొందించిన ఈ చిత్రంలో హీరోయిన్ లేదు. డ్యుయెట్‌లు లేవు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్.. హీరోకి సినిమా మొత్తం ఒకటే ఒక్క డ్రెస్. కాళ్లకి చెప్పులు. ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఆ హీరోకు గట్స్ వుండాలి. దర్శకుడిని, కథని బలంగా నమ్మాలి. అలా కార్తి నమ్మాడు కాబట్టే `ఖైదీ`తో అతనికి బ్లాక్ బస్టర్ హిట్ లభించింది. ఈ సినిమా టేకింగ్, మేకింగ్ రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు ఓ పాఠం అని చెప్పొచ్చు.
అంతలా ప్రభావితం చేసిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయాన్ని సాధించింది. దీంతో ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేయాలని మేకర్స్ రైట్స్ కోసం పోటీపడుతున్నారు. అయితే ఇతర నిర్మాతలతో కలిసి నిర్మించడానికే డ్రీమ్ వారియర్ సంస్థ ఇష్టపడటంతో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ హిందీలో కలిసి నిర్మించడానికి ఇటవలే డ్రీమ్ వారియర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో హీరోగా హృతిక్ రోషన్ నటించబోతున్నట్టు తాజా సమాచారం.
ఇటీవలే సినిమా చూసిన హృతిక్ రోషన్ స్క్రిప్ట్ రెగ్యులర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా వుండటంతో ఇందులో నటించడానికి ఆసక్తిని చూపించినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన డ్రీమ్ వారియర్ టీమ్ నుంచి గానీ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి కానీ వచ్చే అవకాశం వుందని తెలిసింది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/31NLCAn
Comments
Post a Comment