ఒక్క ఛాన్స్…ఒకే ఒక్క ఛాన్స్ అనేది సినిమా ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయిన డైలాగ్. కానీ కొంతమంది ఛాన్స్ అడగకుండా, ఛాన్స్ క్రియేట్ చేసుకుని కసితో కష్టపడి సినిమా తీసి హిట్ కొడతారు. “ఫలక్ నామా దాస్” సినిమా తరువాత టాలీవుడ్ లో విశ్వక్ సేన్ క్రేజ్ పీక్స్ కి వెళ్ళిపోయింది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని సమర్పణలో కాస్ట్యూమ్ డిజైనర్ ప్రశాంతి త్రిపిర్నేనేని ప్రొడ్యూసర్ గా HIT అనే సినిమా లో నటిస్తున్నాడు మన “మాస్ కా దాస్”. శైలేష్ కొలను ఈ సినిమాకు డైరెక్టర్. ఈ సినిమాలో ఒక కేసు సాల్వ్ చేసే పోలీస్ అధికారిగా కనిపిస్తున్నాడు విశ్వక్ సేన్.
అయితే ఈ సినిమాకు HIT అని పేరు ఎందుకు పెట్టారు.? అని మొదటినుండి అందరూ ఆసక్తిగా వెతుకుతూ, రకరకాల ఫ్యాన్ థియరీలు, స్పాయిలర్ అలర్ట్ లు స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే ఈ ఊహాగానాలకు తెర దించుతూ, చిత్ర యూనిట్ ఒక వీడియో విడుదల చేసారు. అందులో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేసు పూర్తి వివరాలు “HIT” లో పెడతామని, HIT అంటే, హోమ్ సైడ్ ఇంటర్వెంషన్ టీం అని, చెప్పిన వీడియో విడుదల చేసారు. ఈ సినిమాకు “స్వరసాగర్” వివేక్ సాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు. రుహానీ శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/38k4edF
Comments
Post a Comment