పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. రెండేళ్ల తర్వాత పవన్ తిరిగి సినిమాలు చేస్తుండడంతో, అందులోనూ వరసపెట్టి సినిమాలకు కమిట్ అవుతుండడంతో పవర్ స్టార్ అభిమానుల ఆనందానికి ఇక అవధుల్లేవు. ఇక నుండి తమకు కూడా ఫస్ట్ లుక్ లు, టీజర్ లు, ట్రైలర్ లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లు, రిలీజ్ డే హంగామాలు వగైరా అన్నీ ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ హీరో తిరిగి రికార్డులను కొల్లగొడతాడని ఆశిస్తున్నారు. పింక్ రీమేక్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.
అయితే ఇప్పటికే పింక్ రీమేక్ గురించి బోలెడన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమాకు లాయర్ సాబ్ అనే టైటిల్ ఫిక్స్ చేసారని ప్రచారం జోరందుకుంది. ఈ టైటిల్ రూమర్ బలపడుతుండడంతో నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగక తప్పలేదు. ఎందుకంటే ఇప్పటికే లీకైన పిక్స్ తో ఫ్యాన్ మేడ్ పోస్టర్లు తెగ విడుదల చేసేస్తున్నారు. ఇవి అంతకంతకూ పెరగడంతో దిల్ రాజు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఈ సినిమాకు ఇంకా ఎటువంటి టైటిల్ ఫిక్స్ చేయలేదని వెల్లడించాడు. అయితే అభిమానులను పూర్తిగా నిరాశపరచకుండా ఈ చిత్ర టైటిల్ ను ఉగాది సందర్భంగా తెలియజేసే అవకాశమున్నట్లు ప్రకటించాడు. అలాగే ఈ చిత్రాన్ని మిడ్ సమ్మర్ లో విడుదల చేసే అవకాశమున్నట్లు ప్రకటించాడు. తేదీ ప్రకటించకపోయినా మే 15న అవ్వొచ్చని అంటున్నారు. మరో రెండు నెలలు ఆగితే కానీ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రాదు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో 26వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. థమన్ సంగీత దర్శకుడిగా ఎంపికైన సంగతి తెల్సిందే. నివేతా థామస్, అంజలి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/31lVIIs
Comments
Post a Comment