కొంత విరామం తరువాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ స్పీడు పెంచారు. వరుసగా వన్ బై వన్ సినిమాలని లైన్‌లో పెడుతున్నారు. ముందు బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింకి`రీమేక్‌తో కెమెరా ముందుకొచ్చారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మరో వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది.
మహిళా సాధికారత కోసం, మహిళల రక్షణ కోసం ఎంత వరకైనా వెళ్లే ఓ పవర్‌ఫుల్ లాయర్‌గా పవన్‌కల్యాణ్ నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ నటించే అవకాశం వుందన్నది తాజా వార్త. సినిమాలో ఓ చిన్ని పాప తల్లి పాత్ర వుందట. ఆ పాత్ర సినిమాకు కీలకంగా వచ్చే సన్నివేశంలో వుంటుందని, అయితే ఆ పాత్రని రేణూ దేశాయ్‌తో యేయిస్తేనే క్రేజ్ వుంటుందని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేశారట.
ఇదే విషయాన్ని రేణూ దేశాయ్‌కి చెప్పారట. అయితే తన పాత్రకున్న ప్రాధాన్యతను బట్టి నటించాలా? వద్దా అన్నది ఆలోచిస్తానని ఆమె సమాధానం చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం చిత్ర బృందం ఆమె సమాధానం కోసం ఎదురుచూస్తున్నారట. ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇస్తే పవన్ ఫ్యాన్స్‌కి పండగే. ఒకే సినిమాలో ఇన్నేళ్ల తరువాత పవన్, రేణూలని చూసే అవకాశం లభిస్తుందన్న మాటే.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2RNo6A8
Comments
Post a Comment