టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొన్ని రోజులుగా వరుస కథానాలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా హైదరాబాద్ కు చెందిన ఎంబీఏ గ్యాడ్యుయేట్ షాలినితో డేటింగ్‌లో వుంటున్నాడు. ఇరు కుటుంబాల పెద్దలు వీరి ప్రేమ పెళ్లికి ఇటీవలే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో నితిన్ ఫ్యామిలీ గత కొన్ని రోజులుగా పెళ్లి పనుల హడావిడిని మొదలుపెట్టింది.
ఈ నెల 16న ఎంగేజ్‌మెంట్ ని చేయాలని ప్లాన్ చేశారు. ఆ తరువాత దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌కి భారీగా ఏర్పాటట్టు చేయాలని పెద్ద లిస్ట్‌నే ప్రిపేర్ చేసుకున్నారు. 60 మంది స్టార్ గెస్ట్‌లని పెళ్లికి ఆహ్వానించాలని, వారికి ప్రత్యేకంగా విమాన టిక్కెట్లు కూడా బుక్ చేయాలనుకున్నారు. కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమే తెలియదు కానీ నితిన్ పెళ్లి వాయిదాపడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఏప్రిల్‌లో జరగాల్సిన పెళ్లి మేకు వాయిదా పడిందని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత వరకు నిజం వుందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. త్వరలోనే పెళ్లికి సంబంధించిన వార్తని నితిన్ అఫీషియల్‌గా వెల్లడించే అవకాశం వుందని, అంత వరకు ఈ పెళ్లి వార్తలు వరుసగా హల్ చల్ చేస్లూనే వుంటాయని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OxwrWv
Comments
Post a Comment