యంగ్ హీరో నిఖిల్ ఊహించని షాకిచ్చారు. గత కొంత కాలంగా పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు మూడేళ్ల క్రితం ఓ అమ్మాయిని నిఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు షికారు చేశాయి. అయితే ఇద్దరి జాతకాలు కలవకపోవడంతో ఎంగేజ్‌మెంట్ కాకుండానే ఆ పెళ్లి ఆగిపోయిందట.
దీంతో మళ్లీ సినిమాల వైపు దృష్టి మళ్లీంచిన నిఖిల్ గత కొంత కాలంగా హిట్‌లు, ఫ్లాప్‌లతో జర్నీ చేస్తున్నారు. ఇటీవల నిఖిల్ నిటించిన `అర్జున్ సురవరం` రిలీజ్ అవుతుందా?.. నిఖిల్‌కి హిట్ ఇస్తుందా? అని అంతా ఆశ్చర్యపోయారు. ఫైనాన్స్ గొడవల కారణంగా ఈ సినిమా బయటికి రావడం కష్టమే అన్నారంతా. అలా ఊహాగానాలు రేకెత్తించిన `అర్జున్ సురవరం` రిలీజ్ కావడమే కాకుండా నిఖిల్‌కు మంచి విజయాన్ని అందించింది.
దీంతో నిఖిల్ మళ్లీ కొత్త ఉత్సాహంతో కొత్త సినిమాకు సిద్ధమయ్యారు. ఓ పక్క సినిమా చేస్తూనే పెళ్లికి సిద్ధమవుతున్నారంటూ ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే తాజాగా పల్లవి అనే డాక్టర్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుని నిఖిల్ అందరికి సడన్ షాక్ ఇచ్చారు. పల్లవివర్మ నచ్చడంతో వెంటనే ఆమెకు ప్రపోజ్ చేశాడట. ఆమె పేరెంట్స్ కూడా ఓకే చెపంప్పడంతో నితిన్, పల్లవివర్మల వివాహం ఏప్రిల్ 16న ఫిక్స్ అయినట్టు తెలిసింది.
After the Super Success of #ArjunSuravaram @actor_Nikhil
and Dr.Pallavi Varma Get engaged … proposed and got acceptance from parents in a formal family function .
The wedding will take place on April 16.Congratulations brother
pic.twitter.com/wDVdkz8yhQ
— SKN (@SKNonline) February 2, 2020
Credit: Twitter
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2uSmgVR

Comments
Post a Comment