Skip to main content

ఇలా అయితే సినిమా బడ్జెట్ ఎలా తగ్గుతుంది.?

Budget Overflow in Tollywood
Budget Overflow in Tollywood

సినిమా మరియు రాజకీయాలలో ఉపయోగపడని ఖర్చు ఒకటి ఉంటుంది.. అది కంట్రోల్ చెయ్యకపోతే బడ్జెట్ చెయ్యి దాటిపోతుంది. ఇక ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే, తీసే సినిమాను రిచ్ గా తీయ్యాలంటే కథలో క్యారెక్టర్స్ ను రిచ్ గా రాసుకుని ఖర్చు పెట్టించనక్కర్లేదు. మామూలు కథను రాసుకుని తీసే పద్దతిలో టెక్నికల్ గా రిచ్ గా తీసే ఒక వర్గం ఉంది. రామ్ గోపాల్ వర్మ, అనురాగ్ కశ్యప్, మనికందన్, బాలా, ఇలా రెండో కేటగిరీకి వస్తారు. ఇక మొదటి కేటగిరీ లో అశుతోష్ గోవారికర్, సంజయ్ లీలా భన్సాలీ వంటి వాళ్ళు ఉన్నారు. తెలుగులో కూడా బడ్జెట్ పై కంట్రోల్ లేని దర్శకులు, వాళ్ళలో పెద్ద దర్శకులు ఉన్నా, ఇప్పుడు వాళ్ళ పేర్లు తీయ్యడం ఇక్క పాయింట్ కాదు.

ఇప్పుడు పెద్ద సినిమాలు అన్నీ నంబర్ ఆఫ్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ లు, వాళ్ళ కాంబినేషన్ లో ఉండే సీన్లతో ఉంటున్నాయి. ఇక ఎక్కువ శాతం సపోర్టింగ్ ఆర్టిస్ట్ లలో ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఒప్పుకుంటే, హీరో, హీరోయిన్స్ మాదిరి 5 – 7 మంది అసిస్టెంట్లను మెయింటెయిన్ చేస్తూ క్యారవాన్ తీసుకుంటూ, చివరకి లోకల్ షూటింగ్ కి కూడా ప్రొడక్షన్ కార్లలో వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇక ఒక క్యారవాన్ మెయింటెయిన్ చెయ్యడానికి రోజుకు రూ. 25 వేలు ఖర్చు అవుతుంది. ఒక్కో అసిస్టెంట్ కనీసం రోజుకు రూ. ౩ వేల నుండి రూ.7 వేల వరకూ తీసుకుంటారు. ఇక ఫుడ్, ఫ్లైట్ టికెట్ లు, ఫారిన్ షెడ్యూల్ కాల్షీట్ లెక్కలు వేరే ఉన్నాయి. ఒక పెద్ద సినిమా షూటింగ్ అంటే రోజుకి కనీసం 9 క్యారవాన్ లు, 50 మందికి పైగా అసిస్టెంట్ లు నిర్మాత పరిస్థితి జేబులో చెక్కు బుక్కు పెట్టుకుని, షెడ్యూల్ అయ్యాక అకౌంటెంట్, ప్రొడక్షన్ మేనేజర్లతో కూర్చుని తల పట్టుకోవలసిన పరిస్థితి ఉంది. బాధాకరమైన అంశం ఏంటంటే ఇంత లావిష్ సెటప్ తమిళ్,కన్నడ, మలయాళం లోలేదు .

ఇంతా ఖర్చు ప్రొడ్యూసర్ జేబులో నుండి తీసి ఇవ్వట్లేదు. సినిమా రిలీజ్ అయ్యాక టికెట్ రేట్లు పెంచుతున్నారు. అదనపు షో లు వేస్తున్నారు. ఈవెంట్ల మీద ఈవెంట్ లు చేస్తున్నారు. ఇప్పటికైనా ట్రెండ్ మార్చి, కొత్తగా ప్రయత్నిస్తే బాగుటుంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2u1qkmF

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...