అక్కినేని నాగచైతన్య వరుస మూడు ఫ్లాప్‌ల తరువాత `మజిలీ`తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. ఆ తరువాత చేసిన `వెంకీమామ` కూడా హిట్ కావడంతో వరుసగా కొత్త తరహా సినిమాల్ని ఎంచుకుంటూ జోరు పెంచేశారు. ప్రస్తుతం వరుసగా నాగచైతన్య మూడు చిత్రాల్ని లైన్‌లో పెట్టారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇప్పటికే ఓ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో వున్న చై ఈ సినిమా తరువాత పరశురామ్‌తో ఓ భారీ సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడు.
దిల్ రాజు బ్యానర్‌లో కొత్త దర్శకుడితో ఓ సినిమా కమిట్ అయినా ఇంకా దానికి సంబంధింన అప్‌డేట్ ఇంకా బయటికి రాలేదు. దీంతో శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న `లవ్‌స్టోరీ` చిత్రాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి పరశురామ్ సినిమాకు వెళ్లబోతున్నాడు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించబోతోంది. ఇటీవలే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. దీన్ని త్వరలోనే పట్టాలెక్కించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బాలీవుడ్ హిట్ చిత్రం `చిచ్చోర్` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారని టాక్. ఇందులో నాగచైతన్యకు జోడీగా కీర్తిసురేష్‌ని ఎంపిక చేశారు. నాగచైతన్య నటిస్తున్న 20 వ చిత్రమిది కావడంతో ఈ చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్‌ని నిర్ణయించాలనుకున్నారట. అయితే `నాగేశ్వరరావు` అనే పేరు బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలోనే బయటికి రానుందని తెలిసింది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/376kKN4
Comments
Post a Comment