పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయం వరకే పవన్ ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు. వరసగా ఒకటి తర్వాత మరొకటి సినిమాలను అనౌన్స్ చేసి వారిని మరింత ఆనందపరిచాడు పవన్. ప్రస్తుతం పవన్ నటించిన రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. మరొకటి ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా గుబురు గెడ్డంతోనే నటించాడు. రెండు వారాలకు పైగా పింక్ రీమేక్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ గుబురు గెడ్డంతోనే షూటింగ్ ను కానిచ్చేశాడు. ఈలోగా క్రిష్ సినిమా పట్టాలెక్కింది. ఇందులో కూడా పవన్ గెడ్డంతోనే కనిపిస్తాడా? అసలు క్రిష్ సినిమాకు పవన్ లుక్ ఎలా ఉండబోతోంది అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
ఎందుకంటే పింక్ రీమేక్ తో ఎంట్రీ ఇస్తున్నా అది కమర్షియల్ హంగులున్న సినిమా కాదు. పైగా అందులో పవన్ రోల్ కూడా చాలా లిమిటెడ్. ఈ నేపథ్యంలో క్రిష్ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. జానపద నేపథ్యంలో సాగే పీరియాడిక్ చిత్రంగా ఇది ప్రచారంలోకి రావడమే ప్రధాన కారణం. అందులోనూ క్రిష్ లాంటి దర్శకుడంటే చెప్పే పనేముంది. అందుకే ఈ సినిమా ఎలా ఉంటుందా అన్న ఆసక్తి అందరిలో ఉంది. వీటన్నిటికీ నిన్న పవన్ లుక్ తో సమాధానం దొరికేసింది. తన పార్టీ మీటింగ్ కు అటెండ్ అయిన పవన్ పూర్తిగా షేవ్ చేసి కనిపించాడు. దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ క్లీన్ షేవ్ లో కనిపించడంతో పవన్ ఫ్యాన్స్ కొత్త లుక్ ను చూసి భలే థ్రిల్ అవుతున్నారు.
అయితే జుట్టును మాత్రం పవన్ అలాగే ఉంచాడు. ఒత్తైన జుట్టు, బారు మీసాలతో పవన్ కొత్త లుక్ అదిరిపోయింది. సినిమాల్లోకి వచ్చిన ఫీల్ ఇప్పుడు వచ్చింది అంటూ అభిమానులు ఆ ఫొటోస్ ను తెగ షేర్ చేసేస్తున్నారు. ఇదే క్రిష్ సినిమాలో పవన్ లుక్ అని అనుకోవచ్చు. ఎందుకంటే పవన్ రీమేక్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి క్రిష్ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసేసాడుగా పవర్ స్టార్.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/38awTC0
Comments
Post a Comment