తమిళ చిత్ర పరిశ్రమలో మళ్లీ రగడ మొదలైంది. గత కొంత కాలంగా నడిగర్ సంఘం, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల విషయంలో వివాదం చోటుచేపుకున్న విషయం తెలిసిందే. తాజాగా తమిళ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికల్లో కొత్త రగడ మొదలైంది. గతంలో ఈ యూనియన్ నుంచి చిన్మియిని సంస్థ కార్యవర్గం తొలగించింది. వైరముత్తు, రాధారవిలపై చిన్మయి చేసిన సంచలన ఆరోపణల కారణంగా ఆమెని డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించారు.
అయితే తను చట్టబద్ధంగా యూనియన్ మెంబన్‌నని స్టే తెచ్చుకున్న చిన్మయి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికల్లో రాధారవిపై పోటీకి దిగింది. దీంతో తమిళ చిత్ర సీమలో రాజకీయాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. తాజాగా యూనియన్ బైలాస్ కారణంగా చిన్మియి నామినేషన్ చెల్లదని నిర్థారించిన యూనియన్ సభ్యులు ఆమె నామినేషన్ చెల్లదంటూ తిరస్కరించారు. దీంతో అధ్యక్ష పదవికి పోటీ చేసిన రాధా రవిని విన్నర్‌గా యూనియన్ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో చిన్మయి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనని మెంబర్‌ని కాదని నామినేషన్‌ని రద్దు చేశారు. కోర్టు ఇచ్చిన తీర్పుని కూడా పక్కన పెట్టి తనని తొలగించారని. ఇలా చేయమని ఎవరు చెప్పారు? రాధారవి చెప్పారా?. అలా అయితే మిస్టర్ రాధారవి లీగల్‌గా ఎదుర్కోవడానికి సిద్ధంగా వుండండి. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/382tyVv
Comments
Post a Comment