“లక్ష్మీ కళ్యాణం” సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యి, తర్వాత సుమంత్ “పౌరుడు” సినిమాతో అందరినీ ఆకర్షించిన కాజల్ వెంటనే, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ “చందమామ” సినిమాతో ఇండస్ట్రీ లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ అయిపోయింది. ఇక ఒక్కసారి మగధీర సినిమాతో మెగా కాంపౌండ్ లోకి వెళ్ళడంతో కాజల్ గ్రాఫ్ పూర్తిగా చేంజ్ అయ్యింది. అసలు మెగా ఫ్యామిలీలో తండ్రి చిరంజీవి గారు, కొడుకు రామ్ చరణ్, బన్నీ, పవన్ కళ్యాణ్ ఇలా అందరితో ఆడిపాడింది. ఇప్పటికీ నయనతార తరువాత టాలీవుడ్ లో సీనియర్ హీరోల ఆప్షన్ కాజల్ అగర్వాల్.
ఇప్పుడు కాజల్ కు మరో గౌరవం దక్కింది. సింగపూర్ లో ఉన్న మేడం టుస్సాడ్స్ మ్యూజియం లో కాజల్ మైనపు బొమ్మను ఏర్పాటు చేసారు నిర్వాహకులు. గోల్డెన్ కలర్ డ్రెస్ లో ఉండే కాజల్ బొమ్మను చూసిన వీక్షకులతో సహా, కాజల్ ఫ్యాన్స్ తెగ ఆనందపడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ అయిన సూపర్ స్టార్ మహేష్, రెబల్ స్టార్ ప్రభాస్ మైనపు ప్రతిమలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటికే కాజల్ మంచు విష్ణు హీరోగా నటిస్తున్న “మోసగాళ్ళు” సినిమాలో నటిస్తోంది. తమిళ్ లో క్వీన్ సినిమా రీమేక్ తోపాటు డైరెక్టర్ శంకర్ సర్ & కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తోన్న ఇండియన్ 2 సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. హిందీలో సైతం “ముంబైసాగా” అనే సినిమా చేస్తూ బిజీ బిజీగా ఉంది కాజల్
Deeply humbled and ecstatic to be honoured, standing amongst global icons. Feels like I’m seeing
myself through the eyes of an artistThe resemblance is uncanny and the attention to detail is spectacular. pic.twitter.com/WmOz38QBpS
— Kajal Aggarwal (@MsKajalAggarwal) February 5, 2020
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2uovLvZ
The resemblance is uncanny and the attention to detail is spectacular.
Comments
Post a Comment