తెలంగాణ రాబిన్ హుడ్ పండుగల సాయన్న. తెలంగాణ రీజియన్‌లో బందిపోటు దొంగగా పేరున్న పండుగల సాయన్న పెద్దలను కొట్టు పేదలకు పెట్టు అనే పంథాలో దోపిడీలు, దొమ్మీలు చేసినట్టు చెబుతారు. అలాంటి వ్యక్తి కథని త్వరలో తెలుగు తెరపై ఆవిష్కరించబోతున్నారు. పిరియాడిక్ ఫిల్మ్‌గా క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తున్నఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి లీపుకురాబోతున్నారు. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ఇందులో హీరోగా నటిస్తున్నారు.
మరో కీలకమైన విషయం ఏంటంటే పవన్‌కల్యాణ్‌తో `ఖుషీ`, `బంగారం` వంటి చిత్రాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం ఈ చిత్రాన్ని ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. `జిల్లా` ఫేమ్ నేసన్ దర్శకత్వంలో అదే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ప్రయత్నించ ఆ ప్రయత్నాల్ని చివరిదశలో విరమించుకున్నారు. అప్పటి నుంచి పవన్‌తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్న ఆయనకు ఇప్పటికి ఈ సినిమా నిర్మించే అవకాశం దక్కింది.
పవన్ ఇందులో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా పూర్తయింది. ఈ సినిమా కోసం హైదరాబాద్ గచ్చిబౌలి పమీపంలోని అల్యూమినియం ఫ్యాక్టరీ ఆవరణలో ఛార్మినార్, తాజ్‌మహల్ సెట్‌లని నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతోంది. హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఖరారు కావాల్సి వుంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/31x8WSM
Comments
Post a Comment