రెండేళ్ల విరామం తరువాత పవర్‌స్టార్ పవన్ `పింక్` రీమేక్‌తో మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల తమిళంలో `నేర్కొండ పార్వై` పేరుతో రూపొంది అక్కడ కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే తెలుగు రీమేక్ మాత్రం ఆ రెండు చిత్రాలకు పూర్తి భిన్నంగా వుంటుందని, కొత్త తరహాలో చూపించబోతున్నామని నిర్మా దిల్ రాజు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసింది.
ఈసినిమాతో పాటు పవన్ మరో రెండు చిత్రాల్ని కూడా ఫటా ఫట్ లైన్‌లో పెట్టేశారు. అందులో ఒకటి క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా. మరొకటి హరీష్‌శంకర్ డైరెక్షన్‌లో. ఈయితే క్రిష్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకి నిర్మాత ఎవరన్నది ఇంత వరకు బయటికి రాలేదు. అయితే ఆ నిర్మాత ఏ.ఎం. రత్నం అని తెలిసింది.
గతంలో పవన్‌తో సినిమా తీయాలని ఆయనకు అడ్వాన్స్ ఇచ్చిన ఏ.ఎం. రత్నం ఇన్ని రోజుల తరువాత సినిమాకు ఒప్పించినట్టు తెలిసింది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందబోతోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. `పింక్` రీమేక్‌తో పాటు సైమల్‌టెనియస్‌గా క్రిష్ మూవీ షూటింగ్ కూడా పూర్తి చేసుకోనుందట. ఇందులో పవన్‌కల్యాణ్ ఓ బందిపోటు దొంగా రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2vRBZox
Comments
Post a Comment