`96` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు తనకు త్రిష కనిపించలేదని, ఆ పాత్రలే సమంతే గుర్తొచ్చిందని చెబుతున్నారు దిల్ రాజు. తమిళ హిట్ చిత్రం `96` ఆధారంగా రూపొందుతున్న చిత్రం `జాను`. సమంత, శర్వానంద్ జంటగా నటిస్తున్నారు. ప్రేమ్ కుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు సోమవారం మీడియాతో పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.
ఆయన మాట్లాడుతూ ` ముందు `జాను`లో నటించడానికి సమంత భయపడిందని, ఇందులో నటించడానికి అసలు ఒప్పుకోలేదని, షూటింగ్ మొదలైన రెండు రోజుల తరువాత ప్రతీరోజు ఓ మ్యాజిక్ జరుగుతోందంటూ తనకు మెసేజ్‌లు పంపేదని, మీరు నన్ను ఈ సినిమాకు ఒప్పించకుంటే చాలా మిస్ అయ్యేదాన్ని అని తనతో చెప్పిందని చెప్పుకొచ్చారు. సామ్, శర్వా గురించి మాట్లాడుతూ ఆ ఇద్దరు చిన్నవాళ్లేమీ కాదని, సినిమాను ఓన్ చేసుకుని అద్భుతంగా నటించారని సామ్, శర్వాలపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇక తమిళ మాతృకలో నటించిన త్రిష తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే కదా? ఆమెనే ఎందుకు తీసుకోలేదని అడిగితే మాత్రం తనదైన శైలిలో సమాధానం చెప్పారు. తాను `96` సినిమా
చూస్తున్నప్పుబు తనకు సమంతే గుర్తొచ్చిందని, అంతే కాకుండా తమిళంలో నటించిన త్రిషనే మళ్లీ రీమేక్ కు తీసుకుంటే మ్యాజిక్ ఏముంటుందని, ఆ కారణం వల్లే సమంతను రీమేక్ కోసం తీసుకున్నామని స్పష్టం చేశారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/31nqm4w
Comments
Post a Comment