రొమాంటిక్ లవ్‌స్టోరీలకు కెరాఫ్ అడ్రస్‌గా నిలిచారు తమిళ దర్శకుడు గౌతమ్‌మీనన్. ఆయన తీసిన చెలి, కాక కాక, ఘర్షణ, ఏమాయ చేసావె వండర్‌ఫుల్ హిట్‌లుగా నిలిచాయి. హీరో సూర్యతో రూపొందించిన కాక కాక, వరణం అయిరమ్(సూర్య సన్నాఫ్ కృష్ణన్) చిత్రాలు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. అయితే ఆ తరువాత సూర్యతో గౌతమ్‌మీనన్ `ధృవనక్షత్రం` చిత్రాన్ని రూపొందించాలని ప్లాన్ చేశారు. అయితే ఇద్దరి మధ్య క్రియేటీవ్ డిఫరెన్సెస్ రావడంతో ఆ సినిమా నుంచి సూర్య తప్పకోవడం అప్పట్లో సంచలనంగా మారింది.
అదే చిత్రాన్ని విక్రమ్ హీరోగా రూపొందించారు, ఫైనాన్షియల్ చిక్కులు, విదేశాల్లో షూటింగ్‌కి పర్మీషన్స్ లభించకపోవడంతో ఈ సినిమా గత రెండేళ్లుగా నిర్మాణం జరుపుకుంటూనే వుంది. దీంతో దర్శకుడిగా గౌతమ్ మీనన్‌కు రెండేళ్ల గ్యాప్ వచ్చింది. తాజాగా ఆయన ఇండస్ట్రీలోకి ప్రవేశించి 20 ఏళ్లు అవుతుండటంతో హీరో సూర్య ఓ ఎమోషనల్ వీడియోని షేర్ చేశారు.
గౌతమ్‌తో తన సక్సెస్‌ఫుల్ జర్నీని గుర్తుచేసుకున్న సూర్య ఒక దశలో ఎమోషనల్ కావడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన సినీ జీవితంలో గౌతమ్ ఇచ్చిన సినిమాలు తనకు మర్చిపోలేని జ్ఞాపకాల్ని అందించాయని, జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని, తొలిసారి ఎగ్మూర్‌లో జరిగిన ఓ బ్యాచ్‌లర్ పార్టీలో గౌతమ్‌ని కలిశానని, ఆ సంఘటన ఇప్పటికి గుర్తుందని చెప్పుకొచ్చారు.
• @Suriya_offl applauds @menongautham for Reminiscing 20yrs of GVM – Music He also recalls #VaaranamAayiram & #KaakhaKaakha memories!
#Love #Positivity pic.twitter.com/eBocE18Z9u
— Surya Fans Club
(@SuriyaFansClub) January 31, 2020
Credit: Twitter
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2GHdxrV

(@SuriyaFansClub)
Comments
Post a Comment