తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్ పాత్రలతో పాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన తార విజయశాంతి. స్టార్ హీరోలకు ధీటుగా యాక్షన్ సన్నివేశాల్లో నటించి వరుస సంచలనాలు సృష్టించారామె. లేడీ సూపర్‌స్టార్‌గా, లేడీ అమితాబ్‌గా పేరుతెచ్చుకున్న రాములమ్మ రాజకీయాల్లోకి ప్రవేశించి సినిమాలకు బ్రేకిచ్చింది.
దాదాపు 13 ఏళ్ల విరామం తరువాత `సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. మహేష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ప్రొఫెసర్ భారతిగా పవర్‌ఫుల్ పాత్రలో నటించి మెప్పించారు. దీంతో ఆమె మాత్రమే చేయదగ్గ పాత్రలకు ఆమె రెడీ అనే సంకేతాలిచ్చారు. ఈ అవకాశాన్ని వాడుకోవాలనుకుంటున్న దర్శకులు తాజాగా ఆమె కోసం పాత్రల్ని సృష్టించడం మొదలుపెట్టారు.
తాజాగా చిరు నటిస్తున్న చిత్రం కోసం విజయశాంతిని చిత్ర దర్శకుడు కొరటాల శివ సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో కథను మలుపు తిప్పే ఓ కీలక పాత్ర వుందట. ఆ పాత్రకు విజయశంతి అయితేనే బాగుంటుందని కొరటాల చెప్పడం, దానికి చిరు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో చిత్ర బృందం ఆమెని సంప్రదించారట. అయితే విజయశాంతి నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని తెలిసింది. ఒక వేళ ఆమె ఓకే అంటే మెగాస్టార్ సినిమాలో రాములమ్మ మెరుపులు ఖాయమన్నట్టే.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Ut94S7
Comments
Post a Comment