పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు ఆయన లుక్స్ పై ఎవరూ కామెంట్ చేయలేదు. ఆయన ఎలాంటి డ్రెస్ లు వేసుకుంటున్నాడు, గెడ్డం ఎందుకు తీయట్లేదు వంటివి ఎవరూ పెద్దగా ప్రశ్నించలేదు. అయితే ఒక్కసారి పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడో లేదో అందరి దృష్టి పవన్ లుక్స్ పైనే ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడమే ఆయన ఫ్యాన్స్ కు పండగను తీసుకొచ్చింది. ఇక వరస పెట్టి సినిమాలు ఒప్పుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతే కాకుండా ఇటీవలే ఒక పొలిటికల్ మీటింగ్ కు పవన్ క్లీన్ షేవ్ తో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పవన్ రెండేళ్ల తర్వాత క్లీన్ షేవ్ తో దర్శనమివ్వడంతో అందరిలో హాట్ టాపిక్ దీని గురించే.
ఇది చాలదన్నట్లు పవన్ చేతికి అదే మీటింగ్ లో ఒక టాటూ అందరి దృష్టిని ఆకర్షించింది. పవన్ స్వభావం బట్టి ఆయనకు టాటూలు అంటే అంత ఇష్టం ఉండదని ఎవరైనా చెబుతారు. మరి ఈ టాటూ ఎక్కడినుండి వచ్చినట్లు? ఏదైనా సినిమా కోసమా అనే అనుమానాలు అందరిలోనూ కలిగాయి. అయితే దీనిపై వివిధ వివరణలు ఆన్లైన్ లో హల్చల్ చేస్తున్నా అన్నిటికంటే ఎక్కువగా కన్వెనియెంట్ గా ఒక ఆన్సర్ అందరికీ సబబుగా అనిపించింది.
ఇది క్రిష్ సినిమాకోసమని తెలుస్తోంది. ఇది ఒక పీరియాడిక్ సబ్జెక్ట్. 19వ శతాబ్దపు నాటి కథ. ఇందులో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపిస్తాడని ఇప్పటికే ప్రచారంలో ఉంది. మొఘలుల కాలంలో బందిపోట్లు చేతిపై గద్ద పచ్చబొట్టును పొడిపించుకునేవారిని చరిత్ర చెబుతోంది. సరిగ్గా ఇప్పుడు పవన్ కూడా చేతికి గద్ద టాటూ వేయించుకుని కనిపించడంతో ఇది క్రిష్ సినిమా కోసమేనని తేల్చేసారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది నెలలు ఎదురు చూడక తప్పదు. ఇటీవలే పవన్ పింక్ రీమేక్ తో పాటు క్రిష్ చిత్రాన్ని కూడా మొదలుపెట్టిన సంగతి తెల్సిందే. వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/37dIIWE
Comments
Post a Comment