`ఎఫ్2`తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ సినిమాకు ముందు, బాహుబలి` తరువాత కొంత డల్ ఫేజ్‌ని చూసిన తమన్నా మళ్లీ జోరు పెంచేసింది. మెగాస్టర్ చిరంజీవి నటించిన `సైనా నరసింహారెడ్డి చిత్రంలో లక్ష్మిగా పరిణతి చెందిన నటనని ప్రదర్శించి శభాష్ అనిపించుకుంది. ఐటమ్ సాంగ్స్ చేస్తూనే నటనకు ఆసక్కారమున్న పాత్రల్లో నటించాలని, అలాంటి పాత్రలకే ప్రాధాన్యతనిస్తోంది. తమన్నా నటిస్తున్న తాజా చిత్రం `సీటీమార్`.
గోపీచంద్ హీరోగా నటిస్తున్నారు. సంపత్‌నంది కొంత విరామం తరువాత ఈ చిత్రాన్ని పక్కా ప్లానింగ్‌తో దర్శకుడిగా మెయిన్ స్ట్రీమ్ డైరెక్టర్‌ల లిస్ట్‌లో చేరాలని చేస్తున్న ప్రయత్నమిది. ఇందులొ గోపీచంద్, తమన్నా మహిళా కబడ్డీ టీమ్‌కు కోచ్‌లుగా నటిస్తున్నారు. శనివారం తమన్నాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇందులో తమన్నా జ్వాలారెడ్డి నే రెబల్ పాత్రలో కొత్తగా కనిపించబోతోంది. ఫస్ట్‌లుక్‌లోనే అది తెలిసిపోతోంది.
సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్‌కు ఆడియన్స్ సీటీకొట్టాల్సిందే అని అర్థమవుతోంది. తన కెరీర్‌లో జ్వాలారెడ్డి ఓ ఛాలెంజింగ్ రోల్ అని, గోపీచంద్‌తో కలిసి తొలిసారి వర్క్ చేస్తున్నానని, సంపత్‌నందితో ఇది తనకు ముచ్చటగా మూడవ సినిమా అని మిల్కీ బ్యూటీ తమన్నా స్పష్టం చేసింది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/3bm7Z4j
Comments
Post a Comment