అల వైకుంఠపురములో నిర్మాతలు అసలు ఏ విషయంలోనూ తగ్గట్లేదు. సినిమాకు ఖర్చు పెట్టే విషయంలో ఎక్కడా వెనుకాడట్లేదు. ఇప్పటికే మనకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో సూపర్ హిట్ సాంగ్ సామజవరగమన పాట కోసం పారిస్ లోని ఎప్పుడూ తీయని కాస్ట్లీ లొకేషన్స్ లో షూటింగ్ చేసారు. ఇక రాములో రాముల పాట గురించి వచ్చిన న్యూస్ కూడా అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ పాటకు ఏకంగా 5 కోట్ల వరకూ ఖర్చు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ పాటలో చాలా ఖరీదైన సెట్స్ వేయడంతో పాటు ముంబై నుండి పదుల సంఖ్యలో డ్యాన్సర్లు పాల్గొనడం వల్ల పాటకు అది ఖర్చయింది. అయితే ఈ రెండు పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో నిర్మాతలు ఇంకా ధైర్యంగా ముందుకు వెళుతున్నారు. ఓ మై గాడ్ సాంగ్ కూడా ఫారిన్ లోనే షూటింగ్ చేసారు. దానికి కూడా బాగానే అయినట్లు తెలుస్తోంది.
ఇక ఇప్పుడు వార్త ఈ సినిమాలోని నాలుగో సాంగ్ బుట్ట బొమ్మ గురించి. నిన్ననే విడుదలైన ఈ సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇది కూడా హిట్ అయినట్లేనని అంటున్నారు శ్రోతలు. విడుదలై 24 గంటలు కూడా పూర్తవ్వకముందే ఈ పాట 2 మిలియన్ వ్యూస్ ను దాటి ముందుకు దూసుకుపోతోంది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ ను మొదలుపెట్టారట. 2 నుండి 5 రోజుల్లో ఈ సాంగ్ షూట్ ను పూర్తి చేయనున్నారు. బుట్ట బొమ్మ సాంగ్ హీరో, హీరోయిన్ ని ఉద్దేశిస్తూ పాడతాడు. ఈ పాటను త్రివిక్రమ్ స్పెషల్ గా ఉండేలా కేర్ తీసుకుంటున్నాడు. తన కెరీర్ లో ఎప్పుడూ లేనిది ఈ పాటలో చాలా ఎక్కువగా పూలు వాడుతున్నట్లు తెలుస్తోంది. వివిధ రకాల అరుదైన పూలను ఈ సాంగ్ షూటింగ్ లో వాడుతున్నారు. కేవలం పూలకే దాదాపు 40 లక్షల దాకా ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది.
ఇలా అల వైకుంఠపురములో అల్లు అర్జున్ కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాకు బజ్ కూడా అదే స్థాయిలో ఉండడం విశేషం. జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రం స్టైలిష్ స్టార్ అభిమానులను కచ్చితంగా అలరిస్తుందని టీమ్ మొత్తం కాన్ఫిడెంట్ గా ఉంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Zjgojw
Comments
Post a Comment