Skip to main content

ఇచ్చిన మాట తప్పను అంటున్నాడు తేజ్

ఇచ్చిన మాట తప్పను అంటున్నాడు తేజ్
ఇచ్చిన మాట తప్పను అంటున్నాడు తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు ఈ ఏడాది గొప్పగా కలిసొచ్చిందని చెప్పాలి. వరసగా ఆరు ప్లాపుల తర్వాత తేజ్ ఈ ఏడాది చిత్రలహరి చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్నాడు. అయితే తన నుండి బ్లాక్ బస్టర్ హిట్ వస్తే మళ్ళీ రైట్ ట్రాక్ లో పడొచ్చని భావించిన తేజ్ ప్రతిరోజూ పండగే చిత్రాన్ని చేసాడు. ఆ సినిమా ఆశించినట్లుగా పూర్తి పాజిటివ్ రెస్పాన్స్ తెచుకోకపోయినా అన్ని వర్గాలకు సమానంగా నచ్చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న సినిమాల్లో దీనికే ఫస్ట్ ప్రిఫరెన్స్ దక్కుతోంది. పోటీగా సినిమాలు పెద్దగా లేకపోవడంతో, ఉన్నవాటికి స్పందన అంతగా లేకపోవడంతో ప్రతిరోజూ పండగే ఆడిందే ఆటగా మారింది. ఇప్పటికే పెట్టిన పెట్టుబడి దాదాపు 70 శాతం రాబట్టిన ఈ చిత్రం రేపు క్రిస్మస్ సందర్భంగా సెలవు కావడంతో మరింత పుంజుకోనుంది.

ట్రేడ్ అనలిస్టులు చెప్పే దాన్ని బట్టి తొలివారంలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు చేరుకోవడం ఖాయం. అలాగే రెండో వారం పెద్దగా పోటీ లేకపోవడంతో సినిమాను కొనుక్కున్న బయ్యర్లందరూ లాభాల బాట పట్టనున్నారు. ఇక ప్రతిరోజూ పండగే చిత్రం సక్సెస్ తో ఫుల్ ఖుషీగా ఉన్న తేజ్ ఇప్పుడు వరస సినిమాలను సెట్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే కొత్త దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో సోలో బ్రతుకే సో బెటరు అనే చిత్రాన్ని చేస్తోన్న తేజ్, దాని తర్వాత దేవా కట్టా దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.

దేవా కట్టా వెన్నెల, ప్రస్థానం సినిమాలతో మొదట చాలా ప్రామిసింగ్ దర్శకుడిగా అనిపించినా రీసెంట్ ఈ దర్శకుడు కొట్టిన హిట్ అంటూ లేదు. డైనమైట్ సినిమా దారుణంగా ఆడింది. ప్రస్థానం సినిమానే హిందీలో అదే పేరుతొ తీస్తే అక్కడ వచ్చిన ఫలితం గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. భారీ నష్టాలని తీసుకొచ్చింది. ఇప్పుడిప్పుడే హిట్ ట్రాక్ లో పడిన తేజ్ మళ్ళీ ఇలా ఫామ్ లో లేని దర్శకుడితో సినిమా చేయడం ఎంత వరకూ కరెక్ట్ అనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే తేజ్ వెర్షన్ వేరేలా ఉంది. దేవా కట్టా తనకు చెప్పిన కథ బాగా నచ్చిందని, తన కెరీర్ లో ఈ చిత్రం చాలా భిన్నంగా ఉంటుందని భావిస్తున్నాడు తేజ్. తనతో సినిమా చేస్తానని ఎప్పుడో మాట ఇచ్చేసానని, సోలో బ్రతుకే.. తర్వాత తెరకెక్కబోయే సినిమా ఇదే అవుతుందని అంటున్నాడు. మరి చూద్దాం ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EN221t

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...