టాలీవుడ్ యంగ్ హీరోల్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు యూత్‌లో భారీ క్రేజ్ వున్న విషయం తెలిసిందే. అది చాలా సందర్భాల్లో బయటపడింది కూడా. `మహర్షి` ప్రీరిలీజ్ వేడుకలో విజయ్ పాల్గొన్నారు. అదే విదికపై నుంచి విజయ్ క్రేజ్‌ని మహేష్ పొగిడి నీ టైమ్ బాగుందని కామెంట్ చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే విజయ్ దేవరకొండ క్రేజ్ కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాలేదు కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ని కూడా తాకింది. అక్కడ ఇప్పటి వరకు విజయ్ సినిమా చేయకపోయినా అతను నటించిన అర్జున్‌రెడ్డి` బాలీవుడ్‌లోనూ సంచలనం సృష్టించడంతో బాలీవుడ్‌లోనూ విజయ్ క్రేజ్ మదలైంది.
హీరోలు, హీరోయిల పార్టీల్లో పాల్గొంటున్న విజయ్ దేవరకొండపై ఓ క్రేజీ హీరోయిన్ మనసు పారేసుకుందట. ఈ విషయాన్ని ఓ పబ్లిక్ ప్లాట్ ఫామ్‌పై చెప్పడంతో దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. రౌడీ హీరోపై క్రష్ వున్న హీరోయిన్ మరెవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్. ఇటీవల నటి నేహా దూపియా నిర్వహిస్తున్న `నో ఫిల్టర్ నేహా` కార్యక్రమంలో పాల్గొన్న జాన్వి ఈ విషయాన్ని నిర్భయంగా వెల్లడించింది. తన తొలి సినిమా హీరో ఇషాన్ కట్టర్ ది నిర్మలమైన మనసని, అతని హృదయం చాలా స్వచ్ఛమైన దని. అతని కళ్లల్లో కోటీ భావాలు కనిపిస్తుంటాయని పొగడ్తల వర్షం కురిపించింది.
విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ అతనిపై క్రష్ వుందని, ఇప్పటికే అతనికి చాలా ఫీలర్స్ వదిలానని, ఇప్పిటికి ఇంకా (అతనితో ఏ సినిమా సెట్ కాలేదని) ఏమీ జరగలేదని చెప్పుకొచ్చింది. జాన్వికపూర్ త్వరలో విజయ్ దేవరకొండతో కలిసి `ఫైటర్` చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ తెరపైకి తీసుకురానున్న ఈ చిత్రం వచ్చే నెల సెట్స్‌పైకి రానుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్లాన్ చేస్తున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35Z6VQI
Comments
Post a Comment