స్వామి రారా నుండి కొన్ని ప్రామిసింగ్ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ సరికొత్త మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న నిఖిల్, ఈ మధ్య పూర్తిగా డౌన్ అయ్యాడు. కేశవ, కిరాక్ పార్టీ చిత్రాలు వరసగా విఫలమవడంతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో పడ్డాడు. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది. అర్జున్ సురవరం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వెళ్ళింది. ఏకంగా ఏడాది పాటు సినిమా విడుదల కాలేదు. అయితే ఎన్నో కష్టాలు పడి మొత్తానికి సినిమా నవంబర్ నెలాఖరుకి విడుదలైంది.
సినిమాకు మొదట ఫుల్ పాజిటివ్ రివ్యూలు రాకపోయినా కలెక్షన్స్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. మొదటిరోజు నుండే సినిమా పాజిటివ్ గా ముందుకెళ్లింది. పోటీగా సినిమాలు కూడా లేకపోవడం అర్జున్ సురవరంకి బాగా కలిసొచ్చింది. కనిదన్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన అర్జున్ సురవరం నిఖిల్ కు బిగ్ బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. తన కెరీర్ ను మళ్ళీ ట్రాక్ లో పెట్టుకునేందుకు అర్జున్ సురవరం ఎంతో దోహదపడింది.
ప్రస్తుతం అర్జున్ సురవరం ఫుల్ రన్ కు చేరుకుంది. ఈ చిత్రం ఫుల్ రన్ లో 21 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయడం విశేషం. షేర్ లెక్కలు వేసుకుంటే తెలుగు రాష్ట్రాల నుండే 8.61 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ ను చూసుకుంటే దాదాపు పది కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అర్జున్ సురవరం దాదాపు 6 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ చిత్రాన్ని కొన్న డిస్ట్రిబ్యూటర్లు అందరూ లాభాల బాట పట్టడం విశేషం. మొత్తంగా ఆశలు వదులుకున్న సినిమాతో నిఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించాడు.
అర్జున్ సురవరం క్లోజింగ్ కలెక్షన్స్ బ్రేక్ డౌన్:
నైజాం :Rs 3.70 Crore
సీడెడ్ :Rs 0.92 Crore
ఉత్తరాంధ్ర :Rs 1.01 Crore
ఈస్ట్ గోదావరి :Rs 0.60 Crore
వెస్ట్ గోదావరి :Rs 0.52 Crore
గుంటూరు :Rs 0.70 Crore
కృష్ణ :Rs 0.66 Crore
నెల్లూరు :Rs 0.41 Crore
తెలుగు రాష్ట్రాల మొత్తం :Rs 8.61 Crore shares
రెస్ట్ ఆఫ్ ఇండియా :Rs 0.67 Crore
ఓవర్సీస్ :Rs 0.61 Crore
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :Rs 9.89 Crore Shares
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2tNsrK5
Comments
Post a Comment