Skip to main content

బాలకృష్ణ అభిమానుల ఆశలన్నీ ఆ దర్శకుడిపైనే

బాలకృష్ణ అభిమానుల ఆశలన్నీ ఆ దర్శకుడిపైనే
బాలకృష్ణ అభిమానుల ఆశలన్నీ ఆ దర్శకుడిపైనే

ఒక్కోసారి ఒక దర్శకుడికి, ఒక హీరోకి మధ్య చెప్పలేని బంధం ఏర్పడుతుంది. వారిద్దరూ అభిప్రాయాల పరంగానే కాదు వ్యక్తిగతంగానూ ఒకలాంటి భావాలతో ఉంటారు. అలాంటి వారు మళ్ళీ మళ్ళీ కలిసిపనిచేయాలనుకుంటారు. హీరో ఎన్ని ప్లాపుల్లో ఉన్నా, లేదా ఆ దర్శకుడు ఎన్ని ప్లాపుల్లో ఉన్నా కానీ వారిద్దరూ కలిసి పనిచేస్తున్నారంటే ట్రేడ్ లో ఒకలాంటి ఉత్సాహం వస్తుంది. అలాంటి ఒక కాంబోనే నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను. అయితే వీరిద్దరూ కలిసి చేసిన రెండు సినిమాలు సింహా, లెజండ్ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ కాంబో సూపర్ సక్సెస్ కాంబోగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మూడోసారి వీరిద్దరూ కలిసి పనిచేయబోతుండడంతో ట్రేడ్ లో ఒకలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ చిత్రంపై ఉన్నాయి.

నిజానికి వీరిద్దరూ వ్యక్తిగతంగా ప్లాపుల్లో ఉన్నారు. నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ ప్లాపులు కొడితే, బోయపాటి శ్రీను వినయ విధేయ రామ అనే అట్టర్ ప్లాప్ సినిమా తీసి ఉన్నాడు. ఇద్దరూ చేసే సినిమాల విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు ఇద్దరూ కలిసి పనిచేస్తుండడంతో ట్రేడ్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతోంది. ఇద్దరూ కలిసి మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఇస్తారని ఆశిస్తోంది.

ఇకపోతే దీనికి మరో యాంగిల్ ఉంది. బాలకృష్ణ ప్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రతిసారి బోయపాటి శ్రీనుతో కలిసి పనిచేస్తే కలిసొస్తోంది. నరసింహనాయుడు అనే సినిమా 2001లో విడుదలైంది. అది బాలయ్య కెరీర్ లోనే అతిపెద్ద హిట్. అయితే దాని తర్వాత బాలయ్య చేసిన ఏవీ అంతగా కలిసిరాలేదు. చెన్నకేశవ రెడ్డి, లక్ష్మి నరసింహ వంటి సినిమా పర్వాలేదనిపించినా మిగిలినవి దారుణంగా పల్టీకొట్టాయి. అంతేనా… బాలయ్య జడ్జిమెంట్ పైనే సందేహాలు రేకెత్తించాయి.

అయితే 2010లో బోయపాటితో సింహా చేసిన బాలయ్య తన కెరీర్ లో అతిపెద్ద హిట్ ను అందుకున్నాడు. అయితే సింహా తర్వాత బాలయ్య మళ్ళీ రూట్ తప్పాడు. పరమవీర చక్ర, శ్రీమన్నారాయణ, అధినాయకుడు అంటూ ఏవేవో సినిమాలు చేసాడు కానీ ఏదీ సక్సెస్ కాలేదు. అప్పుడే బోయపాటి శ్రీనుతో మళ్ళీ లెజండ్ చేసాడు, మళ్ళీ సక్సెస్ కొట్టాడు. ఏకంగా అప్పట్లోనే 40 కోట్ల పైచిలుకు షేర్ రాబట్టింది లెజండ్. అయితే బోయపాటి సినిమా తర్వాత మళ్ళీ ట్రాక్ తప్పాడు. లెజండ్ తర్వాత గౌతమీపుత్ర శాతకర్ణి మినహాయిస్తే ఆ రేంజ్ హిట్ లేదు. రీసెంట్ గా చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ సినిమాలు దారుణంగా పోయాయి. ఇప్పుడు మళ్ళీ బోయపాటి శ్రీనుతో పనిచేస్తుండడంతో బాలయ్య అభిమానులు మళ్ళీ తమను నువ్వే ఆదుకోవాలి అంటున్నారు. వినయ విధేయ రామ ప్లాప్ అయినా ఎక్కడ బోయపాటి మీద ఉన్న నమ్మకం పోలేదు. మరి ఆ నమ్మకాన్ని అతను నిలబెట్టుకుని, బాలయ్యకు మరో మరపురాని విజయాన్ని అందిస్తాడా?



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35SzzDf

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...